Begin typing your search above and press return to search.

బిగ్‌ బాస్‌ : అదే నిజమైతే సంచలనమే

By:  Tupaki Desk   |   23 May 2019 4:43 AM GMT
బిగ్‌ బాస్‌ : అదే నిజమైతే సంచలనమే
X
హిందీ ప్రేక్షకులను దశాబ్ద కాలంకు పైగా ఎంటర్‌ టైన్‌ చేసి ఇంకా చేస్తూనే ఉన్న బిగ్‌ బాస్‌ సౌత్‌ లో కూడా ప్రారంభం అయిన విషయం తెల్సిందే. తెలుగు మరియు తమిళంలో ఒకేసారి ప్రారంభమయ్యింది. తెలుగులో మొదటి సీజన్‌ కు ఎన్టీఆర్‌ హోస్టింగ్‌ చేయగా రెండవ సీజన్‌ కు నాని హోస్టింగ్‌ చేశాడు. మూడవ సీజన్‌ కు ఎవరు హోస్టింగ్‌ చేయబోతున్నారనే విషయంపై క్లారిటీ రావాల్సి ఉంది. అయితే తమిళ బిగ్‌ బాస్‌ కు హోస్టింగ్‌ సమస్య లేదు. మొదటి రెండు సీజన్‌ లకు కమల్‌ హోస్టింగ్‌ చేయగా - మూడవ సీజన్‌ కు కూడా ఆయనే హోస్ట్‌ గా వ్యవహరించబోతున్నట్లుగా ఇప్పటికే ప్రోమో కూడా వచ్చేసింది. ఇక తమిళ బిగ్‌ బాస్‌ పార్టిసిపెంట్స్‌ గురించిన చర్చ పెద్ద ఎత్తున జరుగుతోంది.

తమిళ బిగ్‌ బాస్‌ మూడవ సీజన్‌ లో హీరోయిన్‌ ప్రియా ఆనంద్‌ - నటుడు రాధా రవి - తిలక్‌ రమేష్‌ వంటి స్టార్స్‌ పాల్గొనబోతున్నారు. ఇక ఇదే సీజన్‌ లో ఒక ట్రాన్స్‌ జెండర్‌ లేదా స్వలింగ సంపర్కుడు కూడా పాల్గొనబోతున్నట్లుగా తెలుస్తోంది. షో నిర్వాహకులు కమల్‌ హాసన్‌ ను ఈ విషయమై సంప్రదిస్తే ఆయన గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. త్వరలోనే ప్రారంభం కాబోతున్న షోలో స్వలింగ సంపర్కుడు ఉండేందుకు కమల్‌ ఒప్పుకోవడంతో ఒక్కసారిగా షో పై ఆసక్తి నెలకొంది.

హౌస్‌ లో స్వలింగ సంపర్కుడు ఉంటే ఇతర పార్టిసిపెంట్స్‌ రియాక్షన్‌ ఏంటీ ఇప్పటికే ఒప్పుకున్న వారు ఏమైనా తప్పుకుంటారా అనే విషయమై చర్చ జరుగుతోంది. షో నిర్వాహకులు హైప్‌ తీసుకు వచ్చేందుకు ఈ విషయాన్ని లీక్‌ చేసినట్లుగా తెలుస్తోంది. పార్టిసిపెంట్స్‌ లో స్వలింగ సంపర్కుడు ఉంటే షో రంజుగా సాగే అవకాశం ఉంది. వారి భావోద్వేగాలు వారి మద్య జరిగే సంభాషణలు షో కు టాప్‌ రేటింగ్‌ తెచ్చి పెట్టే అవకాశం ఉందని అంటున్నారు.