Begin typing your search above and press return to search.

ఆ సినిమా వసూళ్లు పేలుతున్నాయ్

By:  Tupaki Desk   |   25 Jun 2017 10:23 AM GMT
ఆ సినిమా వసూళ్లు పేలుతున్నాయ్
X
హాలీవుడ్ లో యాక్షన్ అడ్వంచర్స్ లో ట్రాన్స్ ఫార్మర్స్ సిరీస్ కూడా ఉంటుంది. ఈ సిరీస్ లో ఐదో చిత్రంగా ట్రాన్స్ ఫార్మర్స్: ది లాస్ట్ నైట్ (Transformers: The Last Knight) గత వారం వచ్చింది. శుక్రవారం నాడు కాకుండా.. బుధవారం నాడు రిలీజ్ చేసిన ఈ చిత్రం.. వారం మధ్యలో కూడా భారీ వసూళ్లు సాధించి.. వీకెండ్స్ లో మరింతగా ఇరగదీసేసింది. లేటెస్ట్ మూవీ కావడంతో హాలీవుడ్ టాప్ గ్రాసర్ గా నిలిచింది.

బుధవారం.. గురువారాల్లోనే 23.7 మిలియన్ డాలర్లను రాబట్టిన ఈ చిత్రం.. ఆ తర్వాత రోజున కూడా 13.8 మిలియన్లను కొల్లగొట్టింది. శనివారం నాటికి 50మిలియన్ డాలర్ల మార్క్ దాటగా.. ఆదివారం ముగిసే నాటికి దాదాపు 64 మిలియన్ డాలర్ల వరకూ వసూలు చేయగలిగింది. ఐదు రోజుల వారాతంలో ఇంతటి వసూళ్లను సాధించగలగడం.. రికార్డ్ గా చెప్పచ్చు.

మరోవైపు హాలీవుడ్ టాప్ వసూళ్ల లిస్ట్ లో రెండో స్థానంలో వండర్ ఉమన్ కంటిన్యూ అవుతోంది. ఈ వీకెండ్ లో 27 మిలియన్ డాలర్లను సాధించిన వండర్ ఉమన్.. మొత్తంగా ప్రపంచవ్యాప్తంగా 300 మిలియన్ డాలర్ల మార్కును దాటడం విశేషం. యానిమేషన్ సినిమా కార్స్-3 కూడా వీకెండ్ లో 27 మిలియన్ డాలర్ల వరకూ వసూలు చేయగలిగింది. మొత్తం మీద హాలీవుడ్ మార్కెట్ లో ఈ వారాంతంలో ట్రాన్స్ ఫార్మర్స్5.. వండర్ ఉమన్.. కార్స్3 ల హంగామానే కొనసాగింది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/