Begin typing your search above and press return to search.

ట్రాఫిక్‌ సినిమా.. అతను ఉండుంటేనా..

By:  Tupaki Desk   |   6 May 2016 3:30 PM GMT
ట్రాఫిక్‌ సినిమా.. అతను ఉండుంటేనా..
X
అప్పట్లో మనం ''ట్రాఫిక్‌'' అంటూ ఒక సినిమా చూశాం గుర్తుందా? హైదరాబాద్‌ లో జరిగిన ఒక ఇన్సిడెంట్‌ ను బేస్‌ గా తీసుకొని.. ఒక గుండెను రెండు వేర్వేరు ఊళ్ళకు తీసుకెళ్ళడానికి మధ్యన జరిగే ఓ అద్భుతమైన కథ ఆ సినిమా. నాన్‌ లీనియర్‌ స్ర్కీన్‌ ప్లే తో ఆద్యంతం ఆకట్టుకున్న ఆ సినిమాను ఒరిజినల్‌గా 2011లో మలయాళం తీశారు. మనం చూసింది 2013లో తీసిన తమిళ వెర్షన్‌ తాలూకు తెలుగు డబ్బింగ్‌. ఇవాళే మనోజ్‌ బాజ్‌ పాయ్‌ హీరోగా రూపొందిన ఈ సినిమా హిందీ వర్షెన్‌ ''ట్రాఫిక్‌'' రిలీజైంది.

ఈ సందర్భంగా మనం ఒక్కసారి దర్శకుడు రాజేష్‌ పిళ్ళయ్‌ గురించి చెప్పుకోవాలి. ఈయన 2011లో ట్రాఫిక్‌ సినిమాను తీయడానికి ముందు.. అంతకు 5 ఏళ్ళ క్రితం ఒక సినిమా తీసి ఫ్లాపు కొట్టాడు. అందుకే చాలా కాలం వెయిట్‌ చేసి.. ఈ సినిమాతో ప్రూవ్‌ చేసుకున్నాడు. అయితే తరువాత సినిమాను తమిళంలో కమల్‌ హాసన్‌ తో తీద్దాం అనుకున్నాడు కాని వర్కవుట్‌ కాలేదు. కాని హిందీలో అమితాబ్‌ బచ్చన్‌ .. అజయ్‌ దేవగన్‌ వంటి స్టార్‌ క్యాస్టుతో చేయడానికి ప్రయత్నించాడు. చివరకు 2013లో మనోజ్‌ బాజ్‌ పాయ్‌ హీరోగా చేయడానికి ఒప్పుకున్నాడు. కాని షూటింగు పూర్తి చేయడానికి రెండు సంవత్సరాలు పట్టింది. సినిమా రిలీజ్‌ చేయడానికి ఇంకో సంవత్సరం. ఈరోజు (మే 6న) రిలీజైంది.

కాని విధి విలాస్.. మొన్న ఫిబ్రవరి నెలలో నాన్‌ ఆల్కాలిక్‌ ఫ్యాటీ లివర్‌ డిసీజ్‌ (లివిర్‌ సిరాసిస్‌) వచ్చి 40 ఏళ్ళ వయస్సులో రాజేష్‌ పిళ్లయ్‌ అర్ధంతరంగా మృతి చెందాడు. ఈరోజు అతను బ్రతికి ఉండుంటే ఎంత బాగుండేదో కదూ!!