ఎవెంజర్స్ కుమ్ముడు ఖాయం

Fri Apr 20 2018 21:00:01 GMT+0530 (IST)

ప్రపంచంలోని యాక్షన్ సినిమాల అభిమానులంతా ఆత్రుతగా ఎదురు చూస్తున్న సినిమా ఎవెంజర్స్ఃఇన్ఫినిటీ వార్. సూపర్ హీరోలంతా కలిసి భయంకరమైన ఒక విలన్ ను అడ్డుకునే ప్రయత్నమే ఈ సినిమా. ఎవెంజర్స్ సిరీస్లో ఇది మూడో సినిమా. మొదటి రెండు సిరీస్లు బాక్సాఫీసు వద్ద మంచి వసూళ్లు రాబట్టాయి. త్వరలో విడుదలయ్యే ఎవెంజర్స్ః ఇన్ఫినిటీ వార్ బాక్సాఫీసును బద్దలు కొడుతుందని అంచనా వేస్తున్నారు అంతర్జాతీ ట్రేడ్ ఎక్స్పర్ట్స్.భయంకరమైన విలన్ వస్తున్నాడు. ఇంతవరకు ప్రపంచానికి అతని గురించి తెలియదు. థానోస్ అని పిలిచే ఆ సూపర్ విలన్ ఎలా నిలవరించాలో తెలియక సూపర్ హీరోలంతా తలలు పట్టుకుంటారు. అనంతమైన యుద్ధం చివరికి ఏమైందన్నది తెరమీద చూసి తెలుసుకోవాల్సిందే. ఒకరి కాదు ఇద్దరు కాదు ప్రపంచం మెచ్చిన సూపర్ హీరోలు... స్పైడర్ మ్యాన్ - కెప్టెన్ అమెరికా - ఐరన్ మ్యాన్ - ద హక్ - బ్లాక్ విడో - థోర్ - బ్లాక్ పాంథర్ ... ఇలా ఎంతో మంది హీరోలు ఈ సినిమాలో నటించారు. అందరూ కలిసి అతి శక్తి సంపన్నుడైన థానోస్తో తల పడి ప్రపంచాన్ని కాపాడతారు. ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి ప్రేక్షకుల్లో. ఈ ఏప్రిల్ 27న ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతోంది ఎవెంజర్స్. ప్రముఖ ట్రేడ్ ఎక్స్ పర్ట్ రమేష్ బాలా సినిమా మొదటి వీకెండ్ లోనే భారీ వసూళ్లను రాబట్టి తీరుతుందని అంచనా వేశారు. ఎవెంజర్స్ మొదటి వీకెండ్ లోనే 235 మిలియన్ డాలర్లను కొల్లగొట్టడం ఖాయం అని ట్వీట్ చేశారు. గతం ఎవెంజర్స్ సినిమాలు కూడా భారీగానే వసూలు చేశాయి. ఇప్పుడు మూడో సినిమా అంతకుమించిన కలెక్షన్ల సునామీ కురిపిస్తుందని అంచనా వేస్తున్నారు.

2008లో మార్వెల్ సంస్థ వారు ఎవెంజర్స్ పేరుతో సినిమా తీయడం ప్రారంభించారు. పదేళ్ల ప్రస్థానంలో మార్వెల్ ఇంత భారీ చిత్రాన్ని తీయడం ఇదే తొలిసారి. ఈ సినిమా ఇంగ్లిష్తో పాటూ హిందీ తెలుగు తమిళ భాషల్లోనూ విడుదల అవుతోంది. తెలుగు వెర్షన్ లో సినిమాలోని సూపర్ విలన్ థానోస్కు రానా దగ్గుబాటి డబ్బింగ్ చెప్పారు.