ఈ రోజు నుంచి పరీక్ష షూరూ

Mon May 13 2019 09:55:49 GMT+0530 (IST)

నాలుగు రోజుల లాంగ్ వీకెండ్ ని వాడేసుకుని ఆడుకున్న మహర్షికి ఈ రోజు నుంచి అసలు పరీక్ష మొదలుకానుంది. టికెట్ ధరలు పెంచిన విషయంలో తొలుత కాస్త ఆందోళన వ్యక్తమైనా చివరికి ప్రేక్షకులు మహేష్ వైపే మొగ్గు చూపడంతో వసూళ్ల పరంగా ఎలాంటి ఇబ్బంది ఎదురు కాలేదు. కాకపోతే టాలీవుడ్  బెస్ట్ ఓపెనర్ గా నిలుస్తుందేమో అన్న అంచనా మాత్రం నిలబెట్టుకోలేకపోయాడు మహర్షి.ఇప్పుడు వారాంతం ముగిసింది. ఈ రోజు నుంచి వర్కింగ్ డేస్ మొదలవుతాయి. ఎంత పెద్ద స్టార్ హీరో అయినా వీక్ డేస్ లో డ్రాప్ ఉండటం సహజం. కాకపోతే అది ఎంత మోతాదులో ఉంటుంది అనే దాన్ని బట్టే బ్లాక్ బస్టర్ కలెక్షన్స్ లో మార్పులు చేర్పులు ఉంటాయి. వచ్చిన సమాచారం మేరకు సిటీస్ తో సహా కీలక కేంద్రాల్లో అడ్వాన్స్ బుకింగ్స్  బాగానే ఉన్నాయట

కరెంట్ బుకింగ్ మీద ఎక్కువగా ఆధారపడే సింగల్ స్క్రీన్స్ ఎలా పెర్ఫార్మ్ చేయబోతున్నాయో వేచి చూడాలి. ఫస్ట్ ఫోర్ డేస్ కలెక్షన్స్ కి సంబంధించిన ఫిగర్స్ కూడా ఈ రోజు అందుతాయి కాబట్టి మహర్షి రేంజ్ గురించి ఒక అంచనాకు రావొచ్చు. పోటీ పెద్దగా లేదు. శుక్రవారం అల్లు శిరీష్ ఎబిసిడి ఉంది కానీ అది మరీ మహేష్ ని ప్రభావితం చేస్తుందని అనుకోలేం.  ఎక్స్ ట్రార్థినరి కంటెంట్ ఉంటే తప్ప ఎఫెక్ట్ ఇవ్వకపోవచ్చు. అప్పటికే 8 రోజుల రన్ పూర్తయ్యి ఉంటుంది కాబట్టి అల్లు హీరో మంచి ఓపెనింగ్స్ ని టార్గెట్ చేయొచ్చు. సో గురువారం దాకా వెయిట్ చేసి మహర్షి జోరుని బట్టి ఫైనల్ గా శ్రీమంతుడుని దాటేస్తాడా లేదా చూడాలి.