Begin typing your search above and press return to search.

సంక్రాంతి వార్ నుంచి రాజా డ్రాప్

By:  Tupaki Desk   |   13 Dec 2017 11:30 PM GMT
సంక్రాంతి వార్ నుంచి రాజా డ్రాప్
X
సంక్రాంతి వస్తే టాలీవుడ్ సినిమాలు ఏ స్థాయిలో రిలీజ్ అవుతాయో అందరికి తెలిసిందే. సినిమా కాన్సెప్ట్ మీద కొంచెం నమ్మకం ఉన్నా కూడా ఆ టైమ్ లో రిలీజ్ చేయడానికి నిర్మాతలు ఏ మాత్రం వెనుకాడరు. ఎన్ని బడా సినిమాలు రిలీజ్ అయినా కూడా వెనుకాడకుండా వీలైనన్ని థియేటర్స్ లో రిలీజ్ చేస్తారు. అయితే 2018 సంక్రాంతికి కూడా కొన్ని సినిమాలు పోటీ పడటానికి సిద్ధమయ్యాయి. ముఖ్యంగా బాలయ్య - పవన్ సినిమాలు ఒకే సారి రిలీజ్ అవుతున్నాయి.

అజ్ఞాతవాసి రిలీజ్ డేట్ ను కొన్ని నెలల క్రితమే ఫిక్స్ చేసిన సంగతి తెలిసిందే. తప్పకుండా సినిమా బాక్స్ ఆఫీస్ ని బద్దలు కొట్టాడు ఖాయమని అంటున్నారు. ఇక బాలయ్య జయసింహతో సంక్రాంతి సెంటిమెంట్ ని మరో సారి ట్రై చేసున్నాడు. ఈ రెండు సినిమాలపై అంచనాలు బాగానే ఉన్నాయి. దీంతో పోటీ స్ట్రాంగ్ గా ఉండడంతో రేస్ నుంచి రవితేజ సినిమా తప్పుకోనుంది. నిజానికి మాస్ రాజా టచ్ చేసి చూడు సినిమా కూడా సంక్రాంతికె రిలీజ్ కావాల్సి ఉంది. దాదాపు షూటింగ్ కూడా ఎండింగ్ కు వచ్చేసింది. కానీ పవన్ - బాలయ్య సినిమాల మధ్య రిస్క్ ఎందుకని రిలీజ్ డేట్ ని క్యాన్సిల్ చేసుకున్నారు. త్వరలోనే మరో డేట్ ని అధికారికంగా నిర్మాతలు చెప్పనున్నారు.

అయితే రవి తేజ తప్పుకున్నా కూడా రాజ్ తరుణ్ ఆ స్టార్ హీరోలతో పోటీ పడటానికి సిద్ధమయ్యాడు. ఆ సినిమాల రిలీజ్ అయిన తర్వాత రెండు రోజుల వ్యవధిలో రాజు గాడు అనే సినిమాను రిలీజ్ చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నాడు. ఇక కోలీవుడ్ హీరో సూర్య గ్యాంగ్ కూడా అప్పుడే రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేసుకుంది. మరి ఆ సినిమాలు స్టార్ హీరోల సినిమాలకు ఎంతవరకు పోటీని ఇస్తాయో చూడాలి.