బిగ్ బాస్ కి మేకప్ ప్రాబ్లెం కూడా!

Thu Jun 14 2018 15:49:22 GMT+0530 (IST)

బిగ్ బాస్2.. ఇప్పుడు టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అనాల్సిందే. ఆ స్థాయిలో ఇంకా క్రేజ్ తెచ్చుకోకపోయినా మెల్లగా జనాలు అలవాటు పడుతున్నారు. తొలిసారి ఉన్నంత క్రేజ్.. రేటింగులు కనిపించడం లేదు కానీ.. ఓవరాల్ గా అయితే కార్యక్రమం పుంజుకుంటోంది.ఈ ప్రెస్టీజియస్ రియాల్టీ కార్యక్రమానికి బడా సెలబ్రిటీలు హాజరు అయేందుకు కొంతమంది తారలు నో చెబుతున్నారు. ఇందుకు కారణం మేకప్ అని తెలుస్తోంది. తేజస్వి మదివాడ.. యాంకర్ శ్యామల వంటి వారి బిగ్ బాస్2 లో మేకప్ లేకుండా కనిపించడం చూస్తూనే ఉన్నాం. అయితే.. టాప్ ఫాంలో ఉన్న మరో యాంకర్ ను కూడా బిగ్ బాస్2 కోసం అడిగారట. గట్టిగానే ట్రై చేశారట. పైగా రోజుకు లక్ష రూపాయల చొప్పున పారితోషికం ఇచ్చేందుకు ఆఫర్ చేశారట. కానీ ఇక్కడ అన్నిటి కంటే మెయిన్ ప్రాబ్లెం ఏంటంటే.. బిగ్ బాస్ హౌస్ లో ఉన్నపుడు మేకప్ లేకుండా ఒరిజినల్ గా కనిపించాల్సి వస్తుంది.

ఆ ఒక్క కారణంతోనే అస్సలు కుదరదని చెప్పేసిందట ఆ బ్యూటీ.  గ్లామర్ యాంకర్ గా గుర్తింపు ఉన్న ఆ భామ.. మేకప్ లేకుండా అయితే మొహం మీద మొటిమలతో కనిపిస్తుంది. డార్క్ స్పాట్స్ కూడా  బయటపడతాయి. ఈ కార్యక్రమం కోసం మొత్తం కెరీర్ నే గందరగోళంలో పడేసుకోవాల్సి వస్తుందని అభిప్రాయపడిన ఆ యాంకర్.. మేకప్ లేకుండా కెమేరా ముందు కనిపించే ప్రసక్తే లేదని తేల్చేసిందట.