‘తెనాలి రామకృష్ణ’ కోసం తమిళ కోటింగ్..!

Tue Dec 18 2018 20:01:18 GMT+0530 (IST)

సందీప్ కిషన్ హీరో గా వరుస ఫ్లాప్ లను చవి చూస్తున్నాడు. గత నాలుగు అయిదు సంవత్సరాల్లో ఈయన కు సక్సెస్ అనేదే లేదంటే అతిశయోక్తి లేదు. ఇంతగా ఫ్లాప్ లు వస్తున్నా కూడా అదృష్టం మరియు బ్యాక్ గ్రౌండ్ కారణంగా సందీప్ కిషన్ కు వరుసగా ఆఫర్లు వస్తున్నాయి. నెక్ట్స్ ఏంటీ చిత్రం వచ్చి రెండు వారాలు అయ్యిందో కాలేదో అప్పుడే ‘తెనాలి రామకృష్ణ’ అనే చిత్రాన్ని మొదలు పెట్టాడు. నెక్ట్స్ ఏంటీ మూవీ ఏమాత్రం ఆకట్టుకోలేక పోయింది. బోల్డ్ కంటెంట్ పై చాలా నమ్మకం పెట్టుకున్న సందీప్ తీవ్రం గా నిరాశ పడేలా ప్రేక్షకులు ఫలితాన్ని ఇచ్చారు.తెలుగులో సందీప్ కిషన్ మినిమం కలెక్షన్స్ ను రాబట్టలేక పోయాడు. కొందరు హీరోలు సినిమా ఫ్లాప్ అయినా కూడా ఒక మోస్తరు వసూళ్లను అయినా రాబడుతారు. కాని సందీప్ కిషన్ విషయంలో అలా జరగడం లేదు. అందుకే  తెలుగుతో పాటు తమిళంలో కూడా ఈయన సినిమాలు విడుదల చేస్తే అక్కడ లేదంటే ఇక్కడ సినిమాలకు ఒక మోస్తరు వసూళ్లు అయినా వస్తాయని భావిస్తున్నారు. అందుకే ‘తెనాలి రామకృష్ణ’ను ఆవిధంగానే ప్లాన్ చేస్తున్నట్లుగా సమాచారం అందుతోంది.

‘తెనాలి రామకృష్ణ’ చిత్రం లో సందీప్ కిషన్ కు జోడీగా హన్సికను ఎంపిక చేశారు. సీనియర్ హీరోయిన్ అయిన హన్సిక ఈయనకు సెట్ అయ్యేనా అంటూ కొందరు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అయితే తమిళంలో మంచి క్రేజ్ ఉన్న హన్సిక అయితేనే ఈ సినిమాలో బాగుంటుందని దర్శకుడు నాగేశ్వరరెడ్డి అనుకుంటున్నాడు. హన్సిక తో పాటు వరలక్ష్మి శరత్ కుమార్ ను ఈ చిత్రం కోసం ఎంపిక చేశారట. ముఖ్య పాత్రలో వరలక్ష్మి నటించబోతుంది. వీరిద్దరు మాత్రమే కాకుండా భూమిక చావ్లా కూడా ఈ చిత్రంలో ఉంటుందట. ఈ ముగ్గురు కూడా తమిళంలో మంచి క్రేజ్ ఉన్న స్టార్స్. ఈ ముగ్గురిని ముందు పెట్టి ‘తెనాలి రామకృష్ణ’ను తమిళంలో అమ్మేయాలని నిర్మాతలు భావిస్తున్నట్లుగా అనిపిస్తోంది.