Begin typing your search above and press return to search.

డిజిట‌ల్ దారిలో హాటీ నాటీ బ్యూటీస్

By:  Tupaki Desk   |   13 Sep 2019 5:30 PM GMT
డిజిట‌ల్ దారిలో హాటీ నాటీ బ్యూటీస్
X
పెద్ద తెర - బుల్లితెర స‌రిహ‌ద్దులు చెరిపేస్తోంది డిజిట‌ల్ ప్ర‌పంచం. టీవీకి - స్మార్ట్ ఫోన్ క‌నెక్టివిటీతో ఓటీటీ ప్లాట్ ఫామ్ వేదిక‌గా అస‌లైన పోటీ మొద‌లైంది. అమెజాన్- నెట్ ఫ్లిక్స్ స‌హా కార్పొరెట్ రంగం సిస‌లైన యుద్ధానికి దిగడంతో సీన్ మారిపోయింది. దీనినే డిజిట‌ల్ వార్ గా అభివ‌ర్ణిస్తున్నారు. తాజా స‌న్నివేశం చూస్తుంటే మునుముందు భ‌విష్య‌త్ అంతా వెబ్ సిరీస్.. యూట్యూబ్ సిరీస్ ల‌కే ఉంద‌ని గ్ర‌హిస్తున్నారు మ‌న స్టార్లు. అందుకే అందివ‌చ్చే ఏ అవ‌కాశాన్ని విడిచి పెట్ట‌కుండా ప్ర‌తిదీ ప్ర‌య‌త్నిస్తూనే ఉన్నారు.

ఇప్ప‌టికిప్పుడు స్టార్ హీరోయిన్ల చూపు డిజిట‌ల్ వేదిక‌పైకి మ‌ళ్లింది అంటే అర్థం చేసుకోవ‌చ్చు. హాలీవుడ్ నుంచి బాలీవుడ్ కి ఇంపోర్ట్ అయిన ఈ క‌ల్చ‌ర్ ని ఇటు సౌత్ లో అగ్ర క‌థానాయిక‌లు అడాప్ట్ చేసుకుని ప్రాధాన్య‌త‌నిస్తుండ‌డం సంచ‌ల‌నంగా మారింది. ఇప్ప‌టికే సీనియ‌ర్ సౌత్ బ్యూటీస్ ప్రియ‌మ‌ణి- రాధిక ఆప్టే వంటి నాయిక‌లు డిజిట‌ల్ వేదిక‌పై న‌టిస్తూ వేడి పెంచుతున్నారు. ప‌లువురు బాలీవుడ్ అగ్ర హీరోలు ఈ వేదిక‌పై రాణిస్తున్నారు. నెట్ ఫ్లిక్స్- అమెజాన్ ల‌తో భారీ ఒప్పందాలు కుదుర్చుకుని న‌టిస్తున్నారు.

తెలుగు-త‌మిళం-మ‌ల‌యాళ ప‌రిశ్ర‌మ‌లో సుప్ర‌సిద్ధ నాయిక‌గా పాపుల‌రైన ప్రియ‌మ‌ణి ప్ర‌స్తుతం `ది ఫ్యామిలీ మ్యాన్` అనే వెబ్ సిరీస్ లో న‌టించారు. ఇందులో మ‌నోజ్ బాజ్ పాయ్ క‌థానాయ‌కుడు. అమెజాన్ ప్రైమ్ లో ఇది టెలీకాస్ట్ కానుంది. బాలీవుడ్ లో స్థిర‌ప‌డిన‌ తెలుగు కుర్రాళ్లు రాజ్ అండ్ డీకే దీనికి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. రాధిక ఆప్టే `ది వెడ్డింగ్ గెస్ట్` అనే వెబ్ సిరీస్ లో న‌టిస్తోంది. ఈ సిరీస్ లో స్ల‌మ్ డాగ్ మిలియ‌నీర్ ఫేం దేవ్ ప‌టేల్ తో ఘాటైన రొమాన్స్ సాగిస్తున్న వీడియోలు ఇప్ప‌టికే వెబ్ లో వైర‌ల్ గా మారాయి. ర‌క్త చ‌రిత్ర‌- లెజెండ్ లాంటి చిత్రాల్లో న‌టించిన రాధిక ఆప్టే వెబ్ సిరీస్ లో అందాలు ఆర‌బోసింది. స్విమ్మింగ్ పూల్ లో బికినీ యాక్ట్ తో పాటు డీప్ లిప్ లాక్ లు లాగేస్తూ హీటెక్కించింది. వీళ్ల‌తో పాటే మెగా ప్రిన్సెస్ నిహారిక ఇప్ప‌టికే వెబ్ సిరీస్ ల‌తో పాపుల‌రైన సంగ‌తి తెలిసిందే.

ఆ త‌ర్వాతి జ‌న‌రేష‌న్ లో చంద‌మామ కాజ‌ల్ - అందాల‌ స‌మంత వెబ్ సిరీస్ బ‌రిలోకి దిగారు. త‌మిళ వెర్స‌టైల్ డైరెక్ట‌ర్ వెంక‌ట్ ప్ర‌భు ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌నున్న ఓ త‌మిళ‌ వెబ్ సిరీస్‌ కి కాజ‌ల్ సంత‌కం చేసింది. హాట్ స్టార్‌ లో ప్ర‌సారం కానున్న‌ ఈ వెబ్ సిరీస్ ద్వారా డిజిట‌ల్ ప్ర‌పంచంలోకి కాజ‌ల్ అగ‌ర్వాల్ అడుగులు వేస్తుండ‌డం ఆస‌క్తిక‌రంగా మారింది. పెద్ద తెర‌పై అవ‌కాశాలు త‌గ్గే క్ర‌మంలోనే ఈ నిర్ణ‌యం తీసుకుందా అంటూ అభిమానుల్లో వాడి వేడిగా చ‌ర్చ సాగుతోంది. ఇంకా టైటిల్ ఖ‌రారు కాని ఈ వెబ్ సిరీస్ షూటింగ్ చెన్నైలో ప్రారంభ‌మైంది. మారుతి `బ‌స్‌ స్టాప్‌` ఫేమ్ ఆనంది ఈ వెబ్ సిరీస్ లోనే ఓ కీల‌క పాత్ర‌లో న‌టిస్తోందని స‌మాచారం. అలాగే అక్కినేని కోడ‌లు స‌మంత త్వ‌ర‌లోనే నెట్ ఫ్లిక్స్ లో రాబోతున్న వెబ్ సిరీస్ లో న‌టిస్తోంది. ఓ బేబి- మ‌జిలీ లాంటి బ్లాక్ బ‌స్ట‌ర్ల‌లో న‌టించిన సామ్ దీపం ఉండ‌గానే వెబ్ వేదిక‌గానూ హ‌వా సాగించేందుకు ప్ర‌ణాళిక‌లు సిద్ధం చేయ‌డం ఆస‌క్తిని రేకెత్తిస్తోంది.

సీనియ‌ర్ న‌టి ర‌మ్య‌కృష్ణ‌- అమ్మ జ‌య‌లలిత జీవిత‌క‌థ‌తో రూపొందుతున్న వెబ్ సిరీస్ `క్వీన్`లో న‌టిస్తున్నారు. గౌత‌మ్ మీన‌న్ దీనికి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. నిత్యామీన‌న్ - మౌనిరాయ్- రిద్దిమ పండిట్- రోషిణి చోప్రా వంటి న‌టీమ‌ణులు వెబ్ సిరీస్ ల‌లో న‌టించేందుకు సిద్ధ‌మ‌వుతుండ‌డం ఆస‌క్తిని రేకెత్తిస్తోంది. ఓటీటీ వేదిక భ‌విష్య‌త్ లో చాలా అవకాశాల్ని క్రియేట్ చేస్తున్న నేప‌థ్యంలో అక్క‌డా మంచి భ‌విష్య‌త్ ఉంద‌ని భావిస్తున్నారు వీళ్లంతా. అందుకే ఈ కొత్త దారిని ఎంచుకున్నార‌ని అర్థ‌మ‌వుతోంది.