కల్లోల లోయలో `మిషన్ ఇంపాజిబుల్`!

Sat Jul 14 2018 19:49:04 GMT+0530 (IST)

హాలీవుడ్ లో `మిషన్ ఇంపాజిబుల్ ` సిరీస్ ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పనవరం లేదు. హాలీవుడ్ స్టార్ హీరో టామ్ క్రూజ్ నటించిన ఈ సిరీస్ లో భాగంగా `మిషన్ ఇంపాజిబుల్-ఫాలౌట్` త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇప్పటికే ఈ సిరీస్ లో వచ్చిన సినిమాలు హిట్ అయిన నేపథ్యంలో....ఈ చిత్రంపై భారీ అంచనాలున్నాయి. ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ చిత్రానికి సంబంధించిన కీలమైన సన్నివేశాలను జమ్మూ కశ్మీర్ లో చిత్రీకరిస్తున్నారు. అయితే మీరనుకుంటున్నట్లుగా ఆ జమ్మూ కశ్మీర్ భారత్ లో లేదు. ఆ సినిమా న్యూజిలాండ్ లో షూటింగ్ జరుపుతూ...దానిని జమ్మూ కశ్మీర్ గా చూపించే ప్రయత్నం చేస్తున్నారు నిర్మాతలు. అసలు జమ్మూ కశ్మీర్ లో షూటింగ్ కు అనుమతి లభించకపోవడంతో వారు ఈ పనిచేశారట.హాలీవుడ్ స్టార్ హీరో టామ్ క్రూజ్ తన తదుపరి చిత్రం మిషన్ ఇంపాజిబుల్-ఫాలౌట్ క్లైమాక్స్ లో బిజీగా ఉన్నాడు. వాస్తవానికి ఆ చిత్రంలో కొద్దిగా రాజకీయ అస్ధిరత ఉగ్రవాదం...వంటి అంశాలున్న ప్రాంతంనేపథ్యంలో కొన్ని సన్నివేశాలు చిత్రీకరించాలి. అయితే కశ్మీర్ లో షూటింగ్ కు అనుమతి దొరకదు. దీంతో మంచుకొండలుండే మిగతా ప్రాంతాల్లో ఆ సన్నివేశాలు చిత్రీకరించాలనుకున్నారు. అయితే హెలికాప్టర్ లలో ఛేజ్ సీన్ ను చిత్రీకరించేందుకు న్యూజిలాండ్ మినహా ఏ దేశం అనుమతివ్వలేదు. దీంతో న్యూజిలాండ్ లోని ఓ గ్రామంలో ఏర్పాటు చేసిన కశ్మీర్ సెట్ లో  చిత్రీకరణ జరుపుతున్నారు. అయితే ఈ చిత్రంలో భారతీయ ఆర్మీ ప్రస్తావన కూడా ఉందట. ఇంపాజిబుల్ సిరీస్ లో రెండో చిత్రానికి దర్శకత్వం వహిస్తోన్న దర్శకుడిగా మెక్ క్వారీ ఘనత సాధించారు. కాగా గతంలో మిషన్ ఇంపాజిబుల్ -4 లో ముంబై ప్రస్తావన ఉండడం.... ఆ చిత్రంలో అనిల్ కపూర్ నటించడం తెలిసిందే.