Begin typing your search above and press return to search.

టీవీ..ఫంక్షన్స్.. సినిమా.. అన్నిటా హీరోలే

By:  Tupaki Desk   |   29 Aug 2017 6:14 AM GMT
టీవీ..ఫంక్షన్స్.. సినిమా.. అన్నిటా హీరోలే
X
సినిమా హీరోలు అంటే.. ఒకప్పుడు సినిమా రంగానికే పరిమితం అయ్యేవారు. ఆ తర్వాత ఒకటీ అరా యాడ్స్ లో కనిపించడం ప్రారంభమైంది. ఇప్పుడైతే ఎన్ని బ్రాండ్ ఎండార్స్ మెంట్స్ ఉంటే అంత ఎక్కువ క్రేజ్ అనుకుంటున్నారు. కానీ ఇప్పుడు ఇది కూడా పాత విషయమే అయిపోతోంది. అన్ని రకాల ప్లాట్ ఫామ్స్ లోకి సినీ హీరోలు దూసుకొచ్చేస్తున్నారు. తమ ట్యాలెంట్ చూపించేందుకు వచ్చే ఏ అవకాశాన్ని వదిలి పెట్టడం లేదు.

ఎన్టీఆర్ హోస్ట్ చేస్తున్న బిగ్ బాస్.. ఇప్పుడు టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ. షో కంటే ఆ కార్యక్రమాన్ని ఎన్టీఆర్ హోస్ట్ చేస్తున్న తీరు అందరినీ ఆకట్టుకుంటోంది. అయితే.. తనకు ఎలాంటి అనుభవం లేకపోయినా.. ఈ అవకాశం రాగానే ఛాలెంజ్ గా భావించానని చెబుతున్నాడు ఎన్టీఆర్. జనాలకు సహజంగా ఉండే అవతలి వారి జీవితాల్లోకి తొంగి చూసే ఆసక్తితోనే ఈ ప్రోగ్రాం ఒప్పుకున్నానని చెప్పడం విశేషం.

దగ్గుబాటి రానా కూడా బుల్లితెరపైకి వచ్చేశాడు. నెంబర్ 1 యారీ అంటూ సెలబ్రిటీ టాక్ షో చేస్తున్నాడు. సెలబ్రిటీల మధఅయ ఉండే స్నేహాన్ని ఆవిష్కరించే ఈ కార్యక్రమం తనకు సూపర్ గా నచ్చేసిందని చెబుతున్నాడు రానా. స్టార్ల జీవితాల ప్రైవేట్ సైడ్ ను చూపించే అవకాశం దక్కిందని రానా అంటున్నాడు.

రానాతో కలిసి హీరో నాని రీసెంట్ గా ఐఫా అవార్డ్ ఫంక్షన్ ను హోస్ట్ చేశాడు. ఇద్దరూ కలిసి బోలెడన్ని నవ్వులు పూయించారు. నిజానికి నాని ఓ ఫంక్షన్ ను హోస్ట్ చేయడం ఇదే తొలిసారి. తాను మొదట సంశయించినా.. రానా ఒత్తిడి చేయడంతోనే ఒప్పుకున్నానని చెప్పాడు. ఎలాంటి రిహార్సల్స్ లేకుండా.. స్పాంటేనియస్ గా బిహేవ్ చేసిన ఈ ఫంక్షన్ నిర్వహించడం ద్వారా.. తన యాక్టింగ్ ట్యాలెంట్ పెంచుకున్నానని చెప్పాడు నాని.

విజయ్ దేవరకొండ.. అల్లు శిరీష్ కలిసి రీసెంట్ గా ఓ అవార్డ్ ఫంక్షన్ ను హోస్ట్ చేశారు. ఇలాంటి కార్యక్రమం నిర్వహించడం ఓ అద్భుతమైన అనుభవం అంటున్నాడు విజయ్. తనను తాను ఇంప్రూవ్ చేసుకునేందుకు ఈ ప్లాట్ ఫాం ఉపయోగపడిందని అంటున్నాడు ఈ యంగ్ సెన్సేషనల్ హీరో.

ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవి.. అక్కినేని నాగార్జునలు కూడా మీలో ఎవరు కోటీశ్వరుడు ద్వారా బుల్లితెరపై మెరుపులు మెరిపించిన సంగతి ఆడియన్స్ కు బాగానే తెలుసు. అయితే.. సినిమా హీరోలు.. సినిమాలకే పరిమితం కాకుండా.. ఇతర ప్లాట్ ప్లాట్ ఫామ్ లలో కూడా సత్తా చూపిస్తుండడం.. జనాలకు మాత్రం మంచి వినోదంగానే మారింది.