ఎన్నారైలను వణికిస్తున్న సదరు విక్టిమ్

Thu Jun 14 2018 23:00:01 GMT+0530 (IST)

యూఎస్ లో సౌత్ హీరోయిన్స్ తో నడుపుతున్న హై ప్రొఫైల్ సెక్స్ రాకెట్ ఇప్పుడు సెన్సేషన్ అవుతోంది. ఈ కేసు విషయంలో న్యూయార్క్ పోలీసులు చాలా స్పీడ్ గా పావులు కదుపుతున్నారు. ముఖ్యంగా విక్టిమ్ ఏ అంటూ ఓ హీరోయిన్ ను మెన్షన్ చేసిన అక్కడి పోలీసులు.. ఆమె ఇచ్చిన స్టేట్మెంట్స్ లో కొన్నిటిని కోర్టుకు అందించారు కూడా.అదే ఇప్పుడు ఎన్నారైలను భయపెడుతోంది. టాలీవుడ్ తో పాటు దక్షిణాదిలో కొంతమంది హీరోయిన్లు.. యాక్టర్లను పలు ఈవెంట్లు.. రకరకాల కార్యక్రమాల పేరుతో యూఎస్ కు పిలిపించడం.. వారితో సొమ్ములు బాగా ఉన్నవారితో డీల్స్.. డేట్స్ సెట్ చేయడం వంటివి వింటూనే ఉంటాం. కానీ ఇప్పుడు విక్టిమ్ ఏ.. ఏకంగా పోలీసులకు స్టేట్మెంట్ ఇచ్చేయడంతో.. ఇంతకీ అసలు ఎవరు ఆ విక్టిమ్ ఏ? ఎవరి గురించి చెప్పి ఉంటుంది? ఏమేం చెప్పి ఉంటుందనే సంగతి మాత్రం అంతు చిక్కడం లేదు.

నిజానికి తను ఎవరితోనూ సెక్స్ చేయలేదని.. కాసేపు వారితో కలిసి ముచ్చట్లాడానని విక్టిమ్ ఏ స్టేట్మెంట్ ఇచ్చింది. అయితే.. ఈమె సెక్స్ చేయకపోయినా.. ఎవరెవరు ఈ రాకెట్ లో ఉన్నారనే విషయంపై కొంత అవగాహన ఉండే అవకాశం ఉంది. ఈమె నుంచి ఎక్కువ వివరాలు అంది ఉండడంతోనే.. విక్టిమ్ ఏ గా పోలీసులు నమోదు చేసి ఉండవచ్చని అంటున్నారు. దీంతో ఇప్పటివరకూ పలువురు సినిమా తారలతో ఎంజాయ్ చేసిన ప్రముఖులు అంతా.. తమ పేర్లు ఎక్కడ బైటకు వస్తాయో.. పరువు బజారున పడుతుందో అని భయపడుతున్నారట.