టెంపర్ షాకులు చాలామందికి తగుల్తుయా?

Mon Apr 16 2018 21:53:25 GMT+0530 (IST)

జూనియర్ ఎన్టీఆర్ కెరీర్ ను మలుపు తిప్పిన సినిమా టెంపర్. వరుస ఫ్లాపులతో విపరీతమైన ఒత్తిడిలో ఉన్న సమయంలో వక్కంతం వంశీ కథను.. పూరీ దర్శకత్వంలో రూపొందించి సక్సెస్ తో పాటు పలు ఉత్తమ నటుడు అవార్డులను కూడా దక్కించుకున్నాడు యంగ్ టైగర్. ఆ సంగతి అలా ఉంచితే.. ఈ సినిమాకి అత్యంత కీలకమైన పాయింట్ ఓ అమ్మాయిని నిర్బంధించి వేధింపులకు గురి చేయడం.కథ ప్రకారం చూపరులకు ఆ అమ్మాయికి జరిగిన అన్యాయమే కీలకం అనిపించినా.. అసలు సిసలైన కీ పాయింట్ మాత్రం.. ఆ అమ్మాయిని గురి చేసిన హింసలను వీడియోగా చిత్రీకరించి.. సీడీ రూపంలో భద్రపరచడమే. ఆ సీడీ చుట్టూనే టెంపర్ అసలు కథ తిరుగుతుంది. ఇలాంటి టెంపర్ కహానీలు ఇండస్ట్రీ బేస్ గా చాలానే ఉన్నాయనే టాక్ ఇప్పుడు బాగా సర్క్యులేట్ అవుతోంది. అవకాశాలు అందే రూట్ క్లియర్ చేస్తామనో.. భారీగా ముట్టచెప్పి కానీ.. పలువురు సినిమా తారలు.. హీరోయిన్లతో కాసేపు అత్యంత సఖ్యంగా గడిపేయాలని తపన పడేవారు చాలామంది ఉంటారు. ఇండస్ట్రీ టాక్ ప్రకారం.. ఇలా గడిపిన వారు కూడా ఉంటారట.

అయితే.. ఇలా వారితో గడపడం మాత్రమే కాకుండా.. ఆ అనుభవాలను పదిలపరచుకునేందుకు ఫోటోలు.. వీడియోల రూపంలో భద్రపరచుకున్న ఎన్నారైలు కొంతమంది ఉన్నారట. ఇండస్ట్రీలో కూడా ఇలాంటి ముచ్చటలు తీర్చుకున్న జనాభా కౌంట్ పదుల లెక్కలోనే ఉంటుందని అంటున్నారు. ఇలా తమ సరసాలను వీరు కెమేరాల్లో భద్రపరచునే సమయంలోనే.. ఆయా భామలు కూడా ఇలాంటి వాటినే తమ దగ్గర ఉంచుకోవడం ఆనవాయితీ అని తెలుస్తోంది.

ఇప్పుడు టాలీవుడ్ ను క్యాస్టింగ్ కౌచ్ పేరుతో నడుస్తున్న సెక్స్ స్సాండల్ బాగా సెన్సేషన్ అయిపోతోంది. ఈ సమయంలో తమ దగ్గర ఇలాంటి వీడియోలను ఫోటోలను పెట్టుకున్న వారు తెగ టెన్షన్ పడిపోతున్నారట. అందరూ బైటకు వచ్చి ఇలాంటి రచ్చ చేసే ఛాన్స్ లేదనే ఊరట కొంత లభిస్తున్నా.. చేసిన పని ఎక్కడ బైట పడిపోతోందో అని బాగా భయపడిపోతున్నారట. చేసిందేదో అక్కడితో ముగించేయక.. తీరిగ్గా కెమేరాల్లో బంధించి మరీ సాక్ష్యాలను మిగిల్చినందుకే వీరికి టెన్షన్ తెచ్చిపెట్టింది.