Begin typing your search above and press return to search.

టికెట్ కౌంటర్: వీకెండ్ వరకూ ఇజం ఓకే

By:  Tupaki Desk   |   24 Oct 2016 12:50 PM GMT
టికెట్ కౌంటర్: వీకెండ్ వరకూ ఇజం ఓకే
X
ఈ వారం ఐదు సినిమాలు థియేటర్లలోకి వచ్చాయి. అన్నిటిలోకి ఇజం మినహాయిస్తే మరి దేనిపైనా పెద్దగా అంచనాలు లేవు. బాక్సాఫీస్ వసూళ్లు కూడా అందుకు తగ్గట్లుగానే ఉన్నాయి.

1. ఇజం: పూరీ జగన్నాధ్ దర్శకత్వంలో నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా రూపొందిన ఇజం.. తొలి వారాంతంలో అనూహ్యమైన వసూళ్లు రాబట్టింది. వీకెండ్ వరకే 7 కోట్ల రూపాయల షేర్ వచ్చిందంటే.. పూరీ సినిమాలపై ఆడియన్స్ లో ఉన్న క్రేజ్ అర్ధమవుతుంది. అయితే.. ఇప్పటికే టాక్ పెద్ద బాగా లేకపోవడం.. వీక్ డేస్ లో వసూళ్లపై ఎఫెక్ట్ చూపనుంది. నిర్మాణం.. డిస్ట్రిబ్యూషర్ రేట్లతో పోల్చితే.. ఇజం సేఫ్ జోన్ లోకి వెళ్లడానికి ఇంకా చాలా దూరం ఉంది.

2. ప్రేమమ్: అక్కినేని నాగచైతన్య నటించిన ప్రేమమ్.. ఇప్పటికే హిట్ అని డిక్లేర్ అయిపోయింది. మొదట్లో వచ్చిన వసూళ్లను చూసి బ్లాక్ బస్టర్ ఖాయం అనుకున్నా.. ఆ తర్వాత కలెక్షన్స్ నెమ్మదించాయి. ఈవారం రిలీజ్ అయిన ఇజంకు వసూళ్లు పెరగడం.. ప్రేమమ్ పై ఎఫెక్ట్ చూపింది.

3. నందినీ నర్సింగ్ హోమ్: మహేష్ బాబు సపోర్ట్ చేసినా నందినీ నర్సింగ్ హోమ్ పరిస్థితి పాజిటివ్ గా లేదు. పర్వాలేదనే టాక్ ఉన్నా.. అది వసూళ్లకు హెల్ప్ అవడం లేదు. ట్వీట్స్ ద్వారా ప్రమోట్ చేసేందుకు మహేష్ ప్రయత్నిస్తుండడం.. నందినీ నర్సింగ్ హోమ్ ను కాపాడుతుందేమో చూడాలి.

4. మజ్ను: నేచురల్ స్టార్ నాని మూవీ మజ్ను రన్నింగ్ ఆల్మోస్ట్ చివరకు వచ్చేసింది. ఇంకా ఈ సినిమా టాప్5లో చోటు సంపాదించిందంటే ఆ పుణ్యం అంతా కొత్త సినిమాలదే. అవి కనీస మాత్రం టాక్ లేకపోవడంతోనే తక్కువ థియేటర్లలో ఉన్న మజ్ను.. టాప్5లో నిలవగలిగాడు.

5. శంకర: ఎప్పుడో రిలీజ్ కావాల్సిన నారా రోహిత్ మూవీ శంకర.. ఏ మాత్రం ప్రచారం లేకుండా థియేటర్లలోకి వచ్చింది. కనీసం ఈ సినిమా రిలీజ్ అయిందనే సంగతి కూడా ఎక్కువమందికి తెలీదంటే ప్రమోషన్స్ విషయంలో నిర్మాతలు ఎంత సైలెంట్ గా ఉన్నారో అర్ధమవుతుంది. నారా రోహిత్ కెరీర్ లో శంకర మరో ఫ్లాప్ అని ఫిక్స్ అయిపోవచ్చు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/