Begin typing your search above and press return to search.

రెండు నెలల సినిమాలు.. ఓ క్లారిటీ

By:  Tupaki Desk   |   24 Aug 2016 5:30 PM GMT
రెండు నెలల సినిమాలు.. ఓ క్లారిటీ
X
వరుసగా తెరలు వీడిపోతున్నాయి. వచ్చే రెండు నెలల్లో తెలుగులో విడుదలయ్యే సినిమాల విషయంలో ఓ క్లారిటీ వచ్చేసింది. సెప్టెంబరు.. అక్టోబరు నెలల్లో ప్రతి వారం పండగే అని అర్థమవుతోంది. ఈ రెండు నెలలు పవర్ పాక్డ్‌ గా ఉండబోతోంది. సెప్టెంబరు 1న ‘జనతా గ్యారేజ్’తో మొదలు.. రాబోయే రెండు నెలల్లో ప్రతి వారానికి ఓ సినిమా ఫిక్స్ అయిపోయింది. ‘జనతా గ్యారేజ్’ వచ్చిన వారానికి.. అంటే సెప్టెంబరు 8న విక్రమ్ సినిమా ‘ఇంకొక్కడు’ రిలీజవుతుంది. తమిళంతో పాటు తెలుగులోనూ ఒకేసారి ఆ సినిమా రిలీజవుతుంది. ఆ మరుసటి రోజు సునీల్ మూవీ ‘ఈడు గోల్డ్ ఎహే’ను రిలీజ్ చేస్తారు.

తర్వాతి వారం.. సెప్టెంబరు 16న నాని సినిమా ‘మజ్ను’ వస్తుంది. ఆ తర్వాతి వారానికి నారా రోహిత్-నాగశౌర్యల ‘జ్యో అచ్యుతానంద’ వస్తుందంటుున్నారు. 30వ తారీఖుకి రామ్ సినిమా ‘హైపర్’ చాన్నాళ్ల కిందటే ఫిక్సయింది. ఇక అక్టోబర్లో దసరా సందడికి చాలా సినిమాలే షెడ్యూల్ అయి ఉన్నాయి. దసరాకు కనీసం మూడు సినిమాలు రిలీజయ్యే అవకాశాలున్నాయి. ‘ధృవ’తో పాటు ప్రభుదేవా సినిమా ‘అభినేత్రి’ కూడా ఆ రోజే మూడు భాషల్లో రిలీజవుతుంది. తర్వాతి రోజుకు ‘ప్రేమమ్’ ఫిక్స్ అయింది. ఇక నెలాఖర్లో కాష్మోరా.. ఒక్కడొచ్చాడు సినిమాలు రిలీజవుతాయి. మరి కొన్ని రోజుల్లో ఇంకొన్ని సినిమాలపై క్లారిటీ వస్తుంది.