Begin typing your search above and press return to search.

టాలీవుడ్ టాప్ హీరోయిన్ ఛాన్సుల సీక్రెట్

By:  Tupaki Desk   |   24 March 2017 4:32 AM GMT
టాలీవుడ్ టాప్ హీరోయిన్ ఛాన్సుల సీక్రెట్
X
ఆమె ఇప్పుడు టాలీవుడ్ లో ఓ టాప్ హీరోయిన్. చేతి నిండా అవకాశాలతో వెలిగిపోతోంది. అద్భుతమైన యాక్ట్రెస్ అనాల్సిన పని లేదు కానీ.. కొన్ని మాంచి ఫీలింగ్.. ఎక్స్ ప్రెషన్స్ తో ఆకట్టుకుంటుంది. అంతే కాదు.. రెమ్యూనరేషన్ బాగా ముడితే నిర్మాతలు అడిగినంత ఎక్స్ పోజింగ్ కూడా చేసేస్తుంది.

ఈ హీరోయిన్ కు వరుస భారీ అవకాశాలు దక్కడంపై ఓ ఆరోపణలు వినిపిస్తున్నాయి. తన స్నేహితులను మోసం చేసి ఇలా ఆఫర్స్ ను పట్టేస్తోందట. ఈమెకు ఇండస్ట్రీలో ఇతర హాట్ హీరోయిన్స్ తో మాంచి ఫ్రెండ్ షిప్ ఉంది. అందరూ కలిసి చక్కర్లు కొడుతుంటారు కూడా. ఫ్రెండ్స్ అందరూ మాట్లాడుకునేటప్పుడు తమ ప్రాజెక్టుల గురించి డిస్కషన్ చేసుకోవడం సహజం. మిగిలిన వాళ్లు అప్ కమింగ్ ప్రాజెక్టుల గురించి మాట్లాడితే.. ఈమె మాత్రం చాలా తెలివిగా చేస్తున్న వాటి గురించే డిస్కషన్ చేస్తుందిట. కానీ ఫ్రెండ్స్ చెప్పిన ఇతర సినిమాల గురించి బ్రెయిన్ లో పెట్టేసుకుని.. ఆ తర్వాత మెల్లగా పావులు కదుపుతుందన్నది ఆరోపణ.

అంటే ఆయా దర్శక నిర్మాతలను అప్రోచ్ అవడం.. ఆ ప్రాజెక్టుకు తానే బెటర్ అనే ఫీలింగ్ కలిగించడం.. చివరకు ఆ మూవీ ఈమె చేతుల్లోకి వచ్చేయడం సీక్వెన్స్ లా జరుగుతున్నాయని అంటున్నారు. స్పైసీ లుక్స్.. బెటర్ యాక్టింగ్ కి డ్యాన్సులు కూడా చేసే ట్యాలెంట్ ఈమెకు అదనపు ఆకర్షణ. వీటన్నిటికీ తోడు ఈమె వ్యూహం కూడా ఇప్పటివరకూ బాగానే వర్కవుట్ అవుతోందని అంటున్నారు టాలీవుడ్ జనాలు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/