Begin typing your search above and press return to search.

కామెంట్: ఆ విషయంలో ధైర్యం వచ్చింది

By:  Tupaki Desk   |   28 Sep 2016 3:30 AM GMT
కామెంట్: ఆ విషయంలో ధైర్యం వచ్చింది
X
'ఇన్నేళ్లూ ఒక లెక్క.. ఇప్పటి నుంచి ఒక లెక్క' అంటూ మిర్చి మూవీలో పవర్ ఫుల్ డైలాగ్ చెబుతాడు ప్రభాస్. టాలీవుడ్ పరిస్థితి ప్రస్తుతం దీనికి సరిపోలేలా ఉంది. 75 సంవత్సరాల పండగ కూడా జరుపుకున్న తెలుగు సినిమా చరిత్రలో.. ఇన్నాళ్లూ ఓ లోటు ఉండిపోయింది. అడపా దడపా చిన్నా చితకా సినిమాలు మినహాయిస్తే.. తమ సినిమాలను ద్వి భాషా చిత్రాలుగా తీసేందుకు స్టార్ హీరోలు ఎవరూ ధైర్యం చేయలేకపోయారు.

బాలీవుడ్ తర్వాత అంతటి రేంజ్ ఉన్న ఇండస్ట్రీగా గుర్తింపు పొందినా.. టాలీవుడ్ హీరోలు ఈ విషయంలో మాత్రం వెనకబడిపోయారు. పక్క భాషల హీరోలు ఇక్కడ దున్నేస్తున్నా సరే.. ఇక్కడికే పరిమితం అయిపోయిన మనోళ్లు.. 2016లో మాత్రం ట్రెండ్ మార్చేసి ధైర్యం చేసేస్తున్నారు. బైలింగ్యువల్ మూవీస్ ని వరుసగా క్యూ కట్టించేశారు. ఈ మార్పునకు శ్రీకారం చుట్టింది మాత్రం కింగ్ నాగార్జున. ఊపిరి మూవీని తెలుగు-తమిళ భాషల్లో తీసి హిట్ కొట్టగా.. ఇప్పుడా ఫార్మాట్ కంటిన్యూ అయిపోతోంది.

రీసెంట్ గా జనతా గ్యారేజ్ ని తెలుగు-మలయాళ భాషల్లో ఏకకాలంలో రూపొందించి రిలీజ్ చేసి.. బ్లాక్ బస్టర్ కొట్టాడు యంగ్ టైగర్ ఎన్టీఆర్. ఆ తర్వాత సూపర్ స్టార్ మహేష్ బాబు ధైర్యం చేశాడు. మురుగదాస్ తో మూవీ మొదలు పెట్టి తెలుగు-తమిళ్ బైలింగ్యువల్ చేస్తున్నాడు మహేష్. ఇప్పుడా ట్రెండ్ ని స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కూడా క్యాచ్ చేసేశాడు. లింగుస్వామితో తెలుగు-తమిళ భాషల్లో ద్విభాషా చిత్రం చేయబోతున్నాడు.

నిజానికి వీళ్లందరి కంటే ముందే పక్క రాష్ట్రంలో క్రేజ్ సంపాదించిన హీరోగా బన్నీకి రికార్డ్ ఉన్నా.. అవన్నీ డబ్బింగ్ సినిమాలు మాత్రమే. కానీ ఇప్పుడు లింగుస్వామితో చేస్తున్నది మాత్రం బైలింగ్యువల్ మూవీ. మొత్తానికి ఇన్నేళ్లకైనా పక్క రాష్ట్రాల్లో మార్కెట్ పెంచుకునేందుకు మనోళ్లు ధైర్యం చేస్తుండడం మాత్రం.. కచ్చితంగా ప్రశంసించాల్సిన విషమయే.


Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/