Begin typing your search above and press return to search.

‘రా..రా’ తీసిన పెద్ద దర్శకుడెవరు?

By:  Tupaki Desk   |   23 Feb 2018 4:31 AM GMT
‘రా..రా’ తీసిన పెద్ద దర్శకుడెవరు?
X
సీనియర్ హీరో శ్రీకాంత్ నుంచి వస్తున్న కొత్త సినిమా ‘రా..రా’. ఎప్పుడో షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం చాలా ఆలస్యంగా.. శుక్రవారమే ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఐతే ఈ సినిమా ఎలా ఉంటుంది.. శ్రీకాంత్‌ కు ఎలాంటి ఫలితాన్నందిస్తుంది అన్నదాని కంటే ఈ చిత్రానికి దర్శకుడు లేడు అనే అంశమే చర్చనీయాంశంగా మారింది. ఈ సినిమా పోస్టర్ మీద కానీ.. ట్రైలర్లో కానీ.. ‘దర్శకత్వం’ అనే మాటే కనిపించకపోవడం ఆశ్చర్యపరిచింది. ఈ చిత్రాన్ని శంకర్ అనే దర్శకుడితో మొదలుపెట్టగా.. అతడికి నిర్మాతకు తీవ్ర స్థాయిలో అభిప్రాయ భేదాలు వచ్చి మధ్యలో అతను తప్పుకున్నాడని శ్రీకాంత్ స్వయంగా క్లారిటీ ఇచ్చాడు.

ఇలాంటపుడు వేరే దర్శకుడు లైన్లోకి రావడం.. లేదంటే చిత్ర నిర్మాణ సంస్థకు చెందిన టీం డైరెక్ట్ చేయడం మామూలే. ఐతే చాలా వరకు పెద్దగా పేరు లేని వాళ్లే ఈ బ్యాలెన్స్ వర్క్ పూర్తి చేస్తుంటారు. కానీ ‘రా..రా’ సినిమాను మాత్రం ఒక పెద్ద దర్శకుడే టేకప్ చేశాడట. అతనే సినిమాను పూర్తి చేశాడట. ఐతే ఆ దర్శకుడెవరన్నది మాత్రం బయటికి చెప్పలేమని స్వయంగా శ్రీకాంతే ప్రకటించడం విశేషం. సినిమా కోసం పని చేసినపుడు క్రెడిట్ ఇవ్వడం లేదని గొడవ చేసిన వాళ్లున్నారు కానీ.. ఇలా తమ పేరు వేయొద్దని.. క్రెడిట్ వద్దని ఒక దర్శకుడు చెప్పడం ఇదే తొలిసారి. మరి ఈ హార్రర్ సినిమాను పూర్తి చేసిన ఆ పెద్ద దర్శకుడు ఎవరు? సినిమా చూస్తే శైలి చూసి ఆ విషయంలో ఏదైనా క్లారిటీ వస్తుందా?