Begin typing your search above and press return to search.

కామెంట్: హీరో రేంజ్ డిసైడ్ చేసే విలన్లు

By:  Tupaki Desk   |   20 Jan 2017 7:50 AM GMT
కామెంట్: హీరో రేంజ్ డిసైడ్ చేసే విలన్లు
X
ప్రస్తుతం టాలీవుడ్ లో కొత్త విలన్స్ సీజన్ నడుస్తోందని అనడంలో సందేహం లేదు. విలన్ రోల్ అంటే గతంలో మాదిరిగా.. భయంకరంగా కనిపించడం.. గుబురు మీసం.. కౄరమైన లుక్స్ ఇలాంటివేమీ ఉండడం లేదు. హీరోకు ఏ మాత్రం తీసిపోకుండా.. ఇంకా చెప్పాలంటే.. హీరోకి మించి స్టైలిష్ గా తయారైపోతున్నారు విలన్స్.

అల్లు అర్జున్ మూవీ సరైనోడులో ఆది పినిశెట్టి.. ఎన్టీఆర్ నాన్నకు ప్రేమతో-కళ్యాణ్ రామ్ ఇజం మూవీస్ లో జగపతి బాబు.. రామ్ చరణ్ మూవీ ధృవలో అరవింద్ స్వామి.. ఖైదీ నంబర్ 150లో తరుణ్ అరోరాలను చూస్తే.. టాలీవుడ్ లో విలన్స్ తీరు.. గెటప్.. పాత్రలు ఎలా మారిపోతున్నాయో అర్ధమవుతుంది. 'ఇప్పటి తరాన్ని ప్రతిబింబించేలా విలన్ రోల్స్ ను క్రియేట్ చేస్తున్నారు రైటర్లు. ప్రస్తుతం దేశంలో ఇలాంటి వ్యక్తులు కనిపిస్తుండడంతో ఆడియన్స్ కూడా తేలికగా కనెక్ట్ అవుతున్నారు' అని చెబుతున్నాడు ఖైదీ విలన్ తరుణ్ అరోరా.

'రైటర్స్ ఆలోచనలు రియాలిటీలోకి రావడంతోనే ఇలాంటి కొత్త కొత్త రోల్స్ వస్తున్నాయి' అంటున్నాడు దర్శకుడు అనిల్ రావిపూడి. ఇలాంటి విలన్స్ రియల్ లైఫ్ లో ఉంటారా అని అనిపించడం సబబే అయినా.. హీరో పాత్ర ఎలివేట్ కావాలంటే.. విలన్ పాత్ర అంత స్ట్రాంగ్ గా ఉండాల్సిందే అంటున్నారు మేకర్స్.

వచ్చే నెలలో రిలీజ్ కానున్న నాని మూవీ నేను లోకల్ లో నవీన్ చంద్ర కూడా ఇలాగే నెగిటివ్ రోల్ లోకి కనిపించనున్నాడు. 'పాత్రల సృష్టిలో.. ఆడియన్స్ దృష్టిలో ఇవి విలన్ రోల్స్ అయినా.. చాలా స్ట్రాంగ్ గా ఉండే పాత్రలు' అంటున్నాడు నవీన్ చంద్ర. 'ధృవలో నేను ఆల్కహాల్ తాగడం నుంచి.. సాధారణంగా విలన్స్ చేసే ఏ ఒక్క పనీ చేయను. కానీ అది ఒక బ్యాడ్ కేరక్టర్ అంతే' అంటున్నాడు అరవింద్ స్వామి.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/