Begin typing your search above and press return to search.

సోషల్ మీడియాలో స్టార్ల సంక్రాంతి విషెస్

By:  Tupaki Desk   |   15 Jan 2019 4:32 PM GMT
సోషల్ మీడియాలో స్టార్ల సంక్రాంతి విషెస్
X
తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి పండగను ఘనంగా జరుపుకుంటున్నారు. సాధారణ ప్రజలే కాకుండా టాలీవుడ్ లో దాదాపు చాలా సినిమాల షూటింగులకు బ్రేక్ ఇచ్చారు. సెలబ్రిటీలు కూడా సంక్రాంతి వేడుకలలో మునిగిపోయారు. అంతేకాదు చాలామంది స్టార్లు.. సెలబ్రిటీలు సోషల్ మీడియా ద్వారా ప్రేక్షకులకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు.

భోగ భాగ్యాలు సిరి సంపదలు మీకు మీ కుటుంబ సభ్యులకు కలగాలని కోరుకుంటూ, సంక్రాంతి శుభాకాంక్షలు - ఎన్టీఆర్

సంక్రాంతి పండగ సందర్భంగా మీకు.. మీ కుటుంబ సభ్యులకు నా శుభాకాంక్షలు తెలుపుతున్నాను. మీకు సంక్రాంతి సంతోషం తీసుకురావాలని కోరుకుంటున్నాను. #హ్యాపీ మకర సంక్రాంతి # హ్యాపీ పొంగల్ -మహేష్ బాబు

మీ అందరికీ వెరీ హ్యాపీ సంక్రాంతి - రామ్ చరణ్

మీకు మరియు మీ కుటుంబ సభ్యులకు సంక్రాంతి శుభాకాంక్షలు!! #హ్యాపీ మకర సంక్రాంతి - అల్లు అర్జున్

సంతోషం, సంపద ... మీతో పాటు మీ ఇంట్లో సందడి చేయాలని కోరుకుంటూ ... సంక్రాంతి శుభాకాంక్షలు - సుధీర్ బాబు

మీ ఇంట సుఖ సంతోషాలతో... సిరి సంపదలతో... పాడి పంటలతో... ఆనందంగా వుండాలి అని కోరుకుంటూ...మీకు మరియు మీ కుటుంబ సభ్యులందరికీ #మకరసంక్రాంతి శుభాకాంక్షలు: జగపతి బాబు

ప్రతి ఒక్కరికీ మకర సంక్రాంతి శుభాకాంక్షలు. బీ హ్యాపీ అండ్ బీ బ్లెస్డ్. లవ్ యు ఆల్ - మంచు మనోజ్

మకర సంక్రాంతి శుభాకాంక్షలు. ఈ పండుగ పూట మీ ఇంట సిరి సంపదలు సుఖ సంతోషాలు విలసిల్లాలని కోరుకుంటున్నాను #హ్యాపీ మకర సంక్రాంతి - నందమూరి కళ్యాణ్ రామ్

ప్రతి ఒక్కరికీ హ్యాపీ సంక్రాంతి. మా టీమ్ నుంచి లాట్స్ ఆఫ్ లవ్ అండ్ హ్యాపీనెస్- అఖిల్ అక్కినేని

అందరికీ హ్యాపీ సంక్రాంతి. లవ్ యు ఆల్ - నిఖిల్