కూలింగ్ ప్లస్ షూటింగ్.. కలిపి కానిస్తున్నారు

Mon Mar 20 2017 17:50:31 GMT+0530 (IST)

ఈ సారి సమ్మర్ కాసింత ముందే మొదలైపోయినట్లుగా కనిపిస్తోంది. భారీ ఎండల కారణంగా.. సినిమా షూటింగ్స్ చేయడం కూడా కష్టమైపోతుంది. అందుకే సహజంగా.. సమ్మర్ లో షూటింగ్స్ కి బ్రేక్ పడుతూ ఉంటుంది. కానీ టాలీవుడ్ జనాలు మాత్రం ఈసారి సమ్మర్ ని ఫారిన్ కంట్రీస్ తో చుట్టేయనున్నారు.

ఫారిన్ లొకేషన్స్ లో షూట్ చేయడం ఎలాగూ తప్పదు. అదేదో సమ్మర్ కే కానించేస్తే.. పుణ్యం పురుషార్ధం రెండూ కలిసొస్తాయని భావిస్తారు. ఇటు సమ్మర్ వేడి నుంచి ఎస్కేప్ అవచ్చు. అటు షూటింగ్ కి బ్రేక్ పడకుండా ఫినిష్ చేసేయచ్చు. స్టార్ హీరోలంతా ఇదే పనిలో ఉన్నారిపుడు. పూరీ-బాలయ్యల సినిమా త్వరలోనే యూరోప్ టూర్ బయల్దేరనున్నారు. మరోవైపు కొరటాలతో మహష్ చేయనున్న కొత్త సినిమాను లండన్ లో షూటింగ్ ప్రారంభించనున్నారు. దానికి ముందే మురుగదాస్ సినిమాలో ఓ పాట కోసం కూడా ఫారిన్ టూర్ వెళ్లనున్నాడు మహేష్.

రవితేజ.. నితిన్.. మంచు విష్ణు.. అఖిల్.. కూడా విదేశాలకు బయల్దేరబోతున్నారు. ఆచార అమెరికా యాత్ర అంటూ మంచు విష్ణు-బ్రహ్మానందంలు అమెరికా వెళ్లిపోతున్నారు. అనిల్ రావిపూడి-రవితేజ కాంబినేషన్ లో తెరకెక్కనున్న మూవీ కోసం.. స్విట్జర్లాండ్ టూర్ ప్లాన్ చేశారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/