Begin typing your search above and press return to search.

ఈసారి సంక్రాంతి సినిమాలు.. బేఫికర్

By:  Tupaki Desk   |   3 Dec 2016 11:30 AM GMT
ఈసారి సంక్రాంతి సినిమాలు.. బేఫికర్
X
గత కొన్నేళ్ల నుంచి ప్రతి సంక్రాంతి సినిమాలు విపరీతమైన ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి. ప్రారంభోత్సవం రోజు ధీమాగా సంక్రాంతి రిలీజ్ అని ప్రకటించేయడం.. తీరా రిలీజ్ డేట్ దగ్గర పడేసరికి సినిమా పూర్తి కాక ఇబ్బంది పడటం.. విడుదలకు రెండు వారాల ముందు వరకు అసలు సినిమా వస్తుందా లేదా అన్న ఉత్కంఠ రేకెత్తించడం మామూలైపోయింది. ఈ ఏడాది సంక్రాంతికి వచ్చిన సినిమాల్లో నాన్నకు ప్రేమతో.. డిక్టేటర్ ఇలాంటి పరిస్థితినే ఎదుర్కొన్నాయి. చివరి రోజుల్లో హడావుడిగా ఈ సినిమాల్ని పూర్తి చేశారు. అంతకుముందు ఏడాది గోపాల గోపాల.. టెంపర్ సినిమాల విషయంలోనూ ఇలాగే జరిగింది. చివరికి డెడ్ లైన్ అందుకోలేక ‘టెంపర్’ సంక్రాంతి రేసు నుంచి తప్పుకుంది. ‘గోపాల గోపాల’ అతి కష్టం మీద పోస్ట్ ప్రొడక్షన్ పూర్తి చేసుకుని సంక్రాంతి పోటీకి దిగింది.

ఐతే ఈసారి మాత్రం సంక్రాంతి సినిమాలకు అసలే ఇబ్బందీ కనిపించడం లేదు. ఈసారి రేసులోకి వచ్చిన సినిమాలు కొంచెం లేటుగానే సెట్స్ మీదికి వెళ్లాయి. ఐతే పక్కా ప్లానింగ్ తో రంగంలోకి దిగడం వల్ల అనుకున్న సమయానికంటే కొంచెం ముందుగానే సినిమాలు రెడీ అయిపోయాయి. సంక్రాంతికి రావాల్సిన మూడు సినిమాలు కూడా కనీసం నెల ముందే టాకీ పార్ట్ పూర్తి చేసుకోవడం విశేషం. గౌతమీపుత్ర శాతకర్ణి షూటింగ్ ఆల్రెడీ పూర్తయింది. నెలన్నర ఉండగానే టాకీ పార్ట్ ముగించాడు క్రిష్. శర్వానంద్ సినిమా ‘శతమానం భవతి’ కూడా టాకీ పార్ట్ పూర్తి చేసుకుంది. చిరు మూవీ ‘ఖైదీ నెంబర్ 150’ మిగతా రెంటితో పోలిస్తే కొంచెం లేటుగా షూటింగ్ పూర్తి చేసుకుంది. ఈ మూడు సినిమాల్లో ‘గౌతమీపుత్ర శాతకర్ణి’కి పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కొంచెం ఎక్కువగా ఉంది. అయినప్పటికీ జనవరి తొలి వారానికి ఫస్ట్ కాపీ రెడీగా ఉంచుకోవాలని ఫిక్సయ్యాడు క్రిష్. చిరు సినిమా కూడా ముందే ఫస్ట్ కాపీతో రెడీ అయిపోతుంది.

‘శతమానం భవతి’ని సంక్రాంతికి విడుదల చేసే విషయంలో ప్రస్తుతం కొంచెం కన్ఫ్యూజన్ ఉంది. విడుదల ఖాయం అనుకుంటే మాత్రం రెండు వారాల ముందే సినిమా రెడీ అయిపోతుంది. విశేషం ఏంటంటే.. ఒక దశలో సంక్రాంతి టార్గెట్ తో వెంకీ సినిమా ‘గురు’ను కూడా వేగంగా ముగించేశారు. ఆ సినిమా ఆల్రెడీ టాకీ పార్ట్ పూర్తి చేసుకుంది. ఈ సినిమా జనవరి 26న విడుదల కానుంది. ఒకవేళ ప్రణాళిక మారి సంక్రాంతికి రిలీజ్ చేయాలనకున్నా పెద్ద ఇబ్బందేమీ లేదు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/