హీరోలు ఓకె అనకపోవడమే అతనికి మైనస్

Sun Oct 22 2017 23:00:01 GMT+0530 (IST)


ఆయనో బడా ప్రొడ్యసర్. కాని అది గతం. ఎందుకంటే ఇప్పుడు ఆయన ఏ స్థాయికి వచ్చేశాడంటే.. అసలు ఒక సినిమా తీస్తే అది రిలీజ్ కూడా కావడం లేదు. అయితే ఆయన తక్కువ బడ్జెట్లో మంచి సినిమా తీసి రిలీజ్ కోసం ప్రయత్నించుంటే వర్కవుట్ అయ్యేది కాని.. ఆయన భారీ బడ్జెట్ సినిమా తీసి వేరే స్కెచ్ వేశాడు. అక్కడే దెబ్బ కొట్టేసింది.నిజానికి ఈయన ఈ సినిమా మొదలెట్టగానే.. ఓ ఇద్దరు పెద్ద స్టార్ హీరోలకు వేరే దర్శకులతో కథలు చెప్పించాడు. అయితే ఆ స్టార్ హీరోలు ఓకే అనేసుంటే మాత్రం.. ఆ సినిమాల కోసం ఫైనాన్షియర్లు క్యూ కట్టేశేవారు. అలా కట్టేసినప్పుడు.. వారు ఇచ్చిన డబ్బులతో ఈ సినిమాను పూర్తి చేసుకునేవాడు. ఎలాగో స్టార్ హీరోల సినిమాలు 40 కోట్లతో తీసిన 70 కోట్ల బిజినెస్ అవుతోంది కాబట్టి.. ఈయనకు ఎలా చూసినా లాభమే వచ్చుండేది. కాని ఇక్కడే బ్యాడ్ లక్ ఆయనతో బ్యాడ్మింటన్ ఆడేసింది.

అసలు ఈయన తీసుకెళ్లిన కథలు కాని.. ఆ కథలు చెప్పిన దర్శకులు కాని సదరు హీరోలకు నచ్చలేదు. దానితో ఆ హీరోలు ముందు సినిమా చేస్తానని.. తరువాత నిధానంగా సైడ్ అయిపోయారు. ఈయనకు డబ్బుల కొరత ఏర్పడింది. తన సొంత సినిమా చిక్కుల్లో పడింది. మళ్ళీ ఈయన అప్పుల పాలవుతున్నారు. అది కథ.