Begin typing your search above and press return to search.

పీఆర్వోల మీటింగ్ అందుకేనా?

By:  Tupaki Desk   |   16 July 2018 12:49 PM GMT
పీఆర్వోల మీటింగ్ అందుకేనా?
X
టాలీవుడ్ లో పీఆర్వోల సంస్కృతి ఇప్పటిది కాదు. ఎన్టీఆర్ హయాం నుంచి మహేష్ బాబు దాకా అందరికి ఉన్నదే. కాకపోతే కొందరు హీరోలు శాశ్వతంగా ఒకరినే పెట్టుకుంటే కొందరు సినిమాకు తగ్గట్టు బ్యానర్ ను బట్టి అనుకూలంగా మారుస్తూ ఉంటారు. ఖచ్చితమైన వ్యవస్థీకృత విధానం దీనికి ఏమి లేదు. ఒకరకంగా చెప్పాలంటే విపరీతంగా పెరిగిన హీరో హీరోయిన్ల సంఖ్యతో పాటు నిర్మాణంలో ఉంటున్న సినిమాల నెంబర్ అంతకంత పెరుగుతోంది కాబట్టి ఆ మేరకు పిఆర్వోల విషయంలో కొంత గందరగోళం కూడా ఉంది. అందుకే కొన్ని సార్లు ప్రెస్ మీట్లు క్లాష్ కావడం ఒక హీరో ప్రెస్ మీట్ కు అటెండ్ అవుతున్న మీడియా మరో హీరో ఈవెంట్ ఏదైనా జరిగినప్పుడు మిస్ కావడం లాంటివి తరచూ జరుగుతున్నాయి. దానికి తోడు ఈ పీఆర్వోలకు సంబంధించి ఎలాంటి సంఘం కానీ అసోసియేషన్ పేరుతో ఒక రిజిస్టర్డ్ ట్రస్ట్ కానీ లేదు. వీటి అవసరాన్ని గుర్తించిన పీఆర్వోలు ప్రత్యేకంగా మీటింగ్ ఏర్పాటు చేసుకున్నారట.

హైదరాబాద్ ఎఫ్ ఎన్సిసి లో సుమారు 15 మంది పీఆర్వోలు మీటింగ్ లో పాల్గొన్నట్టు సమాచారం. ప్రస్తుతం తాము ఎదురుకుంటున్న సమస్యలతో పాటు భవిష్యత్తులో ఎవరికైనా సమస్య వచ్చినపుడు దాన్ని సంఘం తరఫున ఎలా పోరాడాలి అనే దాని గురించి ఇందులో చర్చించినట్టు తెలిసింది. అంతే కాకుండా కొంత మీడియా వర్గంతో కొందరు పీఆర్వోలకు వస్తున్న గ్యాప్ ను ఎలా పూడ్చుకోవాలి అనే దాని మీద కాస్త లోతుగా చర్చించినట్టు టాక్. ఫైనల్ గా కంక్లూజన్ దేనికి వచ్చారు అనే వివరం ఇంకా బయటికి రాలేదు కానీ ముందస్తుగా రానున్న సమస్యలు అమలుపరచాల్సిన ప్రణాళికల గురించి డిస్కస్ చేసినట్టు తెలిసింది.మొత్తానికి తమిళ మలయాళ పరిశ్రమల తరహాలో ఒక వ్యవస్థీకృత విధానం వైపు పీఆర్వోలు అడుగులు వేస్తున్నట్టు కనిపిస్తోంది.