Begin typing your search above and press return to search.

సానియాకి టాలీవుడ్‌ పిలుపు

By:  Tupaki Desk   |   4 Aug 2015 5:43 PM GMT
సానియాకి టాలీవుడ్‌ పిలుపు
X
ర్యాంపు పై మెరుపులు మెరిపించడం టెన్నిస్‌ సంచలనం సానియా మీర్జా కి కొత్తేమీ కాదు కానీ, నిన్నటిరోజున ముంబై జువెలరీ వీక్‌ లో ఈ అమ్మడు హొయలు పోయిన తీరు ఫిలింమేకర్స్‌ కి ముచ్చెమటలు పోయించింది. ఔరా.. దివి నుంచి భువికి దిగి వచ్చిన దేవకన్యక లా ఉందే.. అంటూ లోలోన మదనపడిపోయారు. ఇంతటి సౌందర్యాన్ని ఇలలో నైనా, కలలో నైనా ఇన్నాళ్లు చూడలేదే.. అంటూ మనసు పడిపోయారు. అంతేనా .. సానియా పర్సనల్‌ ఫోన్‌ నంబర్‌ అవౌలబిలిటీ ఉన్న టాలీవుడ్‌ ఫిలింమేకర్స్‌ అంతా ఈ అమ్మడికి కాల్‌ చేసి మరీ అభినందించారు. ఓకే అనాలే కానీ అవకాశాలిస్తామని చెప్పారు. అయితే ఇక సానియా గ్రీన్‌ సిగ్నల్‌ ఇవ్వడమే ఆలస్యం.

ఒకవేళ సానియాకి అవకాశం ఇస్తే ఎలాంటి అవకాశం ఇవ్వాలి? అని ఓ క్విజ్‌ కాంపిటీషన్‌ పెడితే ఎలా ఉంటుంది? బాహుబలి 2లో రాజమౌళి ఓ ఛాన్సిస్తానంటే సానియా ఓకే చెబుతుందా? సానియా ఇంటర్నేషనల్‌ ఫేమస్‌ కాబట్టి అది సినిమాకి కలిసి వస్తుంది కాబట్టి రాజమౌళి అడిగే అవకాశం ఉంది. రుద్రమదేవి పార్ట్‌ 2లో గుణశేఖర్‌ ఛాన్సిస్తానంటే నటిస్తుందా? ఏమో గుణ ఆలోచిస్తున్నాడేమో! ఒకవేళ మహేష్‌, పవన్‌ లాంటి స్టార్లు తమ తదుపరి చిత్రాల్లో ఛాన్సులిస్తామంటే సానియా ఓకే చేస్తుందా? చేస్తే బావుణ్ణు కదూ!