Begin typing your search above and press return to search.

కామెంట్: సెప్టెంబర్ ఇంత వేడెక్కేసిందేంటి

By:  Tupaki Desk   |   27 July 2016 10:30 PM GMT
కామెంట్: సెప్టెంబర్ ఇంత వేడెక్కేసిందేంటి
X
పండగల సీజన్ లో అయినా సెలవల సీజన్ లో అయినా వరుసగానో.. ఒకేసారో ఎక్కువగా సినిమాలు రిలీజ్ చేయడం జరుగుతుంది. సాధారణంగా సంక్రాంతి.. సమ్మర్.. దసరా.. దీపావళి పండగల టైమ్ లో ఎక్కువ సినిమా రిలీజ్ లు చూస్తూ ఉంటాం. కానీ ఈ సారి మాత్రం సెప్టెంబర్ బాగా వేడెక్కేసింది.

ప్రతీ నెలలో ఒకటో రెండో చెప్పుకోదగ్గ సినిమాలు.. ఓ అరడజన్ చిన్న సినిమాలు రావడం కామన్. సెప్టెంబర్ లో వస్తున్నట్లు ఇప్పటికే చెప్పిన సినిమాల లిస్ట్ చూస్తే.. కెవ్ అనాల్సిందే. సెప్టెంబర్ 2న వస్తున్న ఎన్టీఆర్-కొరటాల సినిమాతో మొదలుపెడితే.. అన్నీ భారీ చిత్రాలే. మిల్కీ బ్యూటీ తమన్నా అభినేత్రి.. నేచురల్ స్టార్ నాని నటిస్తున్న మజ్ను.. నాగ చైతన్య మూవీ ప్రేమమ్.. గోపీచంద్ సినిమా ఆక్సిజన్.. పూరీ-కళ్యాణ్ రామ్ ల ఇజం.. ఎనర్జిటిక్ హీరో రామ్ చూపించే హైపర్.. ఇవీ ఇప్పటివరకూ సెప్టెంబర్ కి షెడ్యూల్ చేసిన సినిమాలు.

ఆ నెలలో 5 శుక్రవారాలున్నా.. 7 క్రేజీ ప్రాజెక్టులు క్యూ కట్టేశాయి. దసరా మధ్యలో రామ్ చరణ్ ధృవ వస్తోంది కాబట్టి.. ఈ లోగానే ఈ సినిమాలన్నీ వసూళ్లు రాబట్టేయాలి. లేకపోతే థియేటర్స్ సమస్య వస్తుంది. అందుకే ఇంతగా సెప్టెంబర్ ని వేడెక్కించేశారు. వర్షాకాలంలో ఇంత వేడిని ఎన్ని సినిమాలు తట్టుకుంటాయో!