Begin typing your search above and press return to search.

టాలీవుడ్ కి అక్కినేని ఫ్యామిలీ పాఠాలు

By:  Tupaki Desk   |   27 May 2017 5:30 PM GMT
టాలీవుడ్ కి అక్కినేని ఫ్యామిలీ పాఠాలు
X
స్టార్ల వారసులు సినీ రంగ ప్రవేశం చేయడం ఎప్పటి నుంచో ఉన్న విషయమే. మిగిలిన పరిశ్రమల్లో స్టార్ ఫ్యామిలీస్ కు చెందిన అమ్మాయిలు కూడా సత్తా చాటుతుంటారు కానీ.. టాలీవుడ్ లో మాత్రం ఇది చెల్లలేదు. సినీ రంగంపై ఉన్న ఇష్టంతో హీరోయిన్ గా అవుదామనే కోరికను చాలామందే చంపేసుకోవాల్సి వచ్చింది.

అభిమానులు ఫీలవుతారని.. ఇతర హీరోల అభిమానులు ఎగతాళి చేస్తారని.. ఫ్యాన్స్ అసోసియేషన్ ల ఒత్తిడి అని.. ఇలా రకరకాల రీజన్స్ తో పలువురు అమ్మాయిలు హీరోయిన్ కలలను దూరం చేసుకోవాల్సి వచ్చింది. కొందరు సైడ్ కేరక్టర్లతో సరిపెట్టుకుంటే.. మరికొందరు మాత్రం నిర్మాతలుగా మిగిలిపోయారు. కానీ అక్కినేని నాగార్జున మాత్రం ఈ విషయంలో చాలా డేరింగ్ నిర్ణయాలు తీసుకున్నారు. కొడుకులే కాదు.. తమ ఇంటి అమ్మాయిల విషయంలో నాగ్ తీసుకున్న డెసిషన్స్ కు హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే.

21 ఏళ్ల క్రితం నాగార్జున మేనకోడలు సుప్రియ.. పవన్ కళ్యాణ్ అరంగేట్ర మూవీ అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయితో హీరోయిన్ గా పరిచయం అయింది. అప్పట్లో ఇది సెన్సేషన్. ఆమె హీరోయిన్ గా కెరీర్ కంటిన్యూ చేయలేదు. ఇప్పుడు కాబోయే కోడలు సమంత విషయంలో కూడా నాగార్జున విశాల హృదయంతోనే ఆలోచిస్తున్నారు. స్టార్ హీరోయిన్ అయిన సమంత.. తమ కోడలు అయినంత మాత్రాన కెరీర్ ను చంపేసుకోవాల్సిన పని లేదని చెప్పేశారు.

తాజాగా సమంత హ్యాండ్ లూమ్ బికినీ టైపు డ్రెస్సులో ఓ ఫోటో షూట్ చేసింది. చేనేత వస్త్రాలకు ప్రచారంతో పాటు.. ఇటు ఎక్స్ పోజింగ్ డోస్ కూడా ఎక్కువగానే ఉంది. ఇలాంటి ఫోటో షూట్స్.. ఓ టాప్ రేంజ్ ఫ్యామిలీ ఇంటి కోడలి నుంచి ఎక్స్ పెక్ట్ చేయడం చాలా కష్టమైన విషయం. తమ ఇంటి కోడలు కాకముందు సమంత ఎలా ఉందో అలాగే ఉండేందుకు నాగార్జున.. తనకు భార్య కాకముందు ఉన్న స్టేజ్ లో కొనసాగేందుకు నాగచైతన్య.. సమంతకు ఫుల్ ఫ్రీడమ్ ఇవ్వడం చూస్తే.. టాలీవుడ్ కి అక్కినేని ఫ్యామిలీ కొత్త పాఠాలు నేర్పుతోందని అర్ధం చేసుకోవాల్సిందే.


Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/