Begin typing your search above and press return to search.

తెలుగులో మళ్ళీ కరువొచ్చిందా?

By:  Tupaki Desk   |   26 July 2016 5:30 PM GMT
తెలుగులో మళ్ళీ కరువొచ్చిందా?
X
తెలుగులో స్టార్ హీరోయిన్స్ కి ఏ మాత్రం కొరత లేదని అనిపిస్తుంది. పరాయి భాషల భామలను కూడా మన సొంతం అని అనుకునే విశాల హృదయం.. అటు మేకర్స్ కి.. ఇటు ఆడియన్స్ కి కూడా ఉంది. అలాగే స్టార్ హీరోయిన్ అనగానే గుర్తొచ్చే పేర్లు.. టాలీవుడ్ లో చాలానే ఉన్నాయ్. అయినా సరే.. ఇప్పటి పరిస్థితులు చూస్తే టాలీవుడ్ కి స్టార్ హీరోయిన్ల కొరత అని యాక్సెప్ట్ చేయాల్సిందే.

టాప్ హీరోయిన్ సమంత కొత్త సినిమాలేవీ యాక్సెప్ట్ చేయడం లేదు. నిశ్చితార్ధమో.. పెళ్లో.. దేనికి సిద్ధమవుతోందో కానీ కొత్త ప్రాజెక్ట్ కి ఒప్పుకోవడం లేదు. అనుష్క ఇప్పటికే పెద్ద హీరోయిన్ అయిపోయింది. భారీ సినిమాలకు హీరోయిన్ ఓరియెంటెడ్ మూవీస్ కే పరిమితమా అన్నట్లుంది. ఇక స్వీటీ సైజ్ కూడా ఇబ్బంది పెడుతోంది. సినిమాల ఎంపిక విషయంలో శృతి హాసన్ చాలా సెలక్టివ్. శ్రీమంతుడు లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత.. చైతుతో ప్రేమమ్.. పవన్ తో కొత్త సినిమాను మాత్రమే ఒప్పుకుంది. కాజల్ అగర్వాల్ ఇప్పటికే ఫేడవుట్ అయిపోయే స్టేజ్ కి వచ్చిందనే టాక్ ఉంది.

అందుకే ఇప్పటివరకూ హీరోయిన్ ని రిపీట్ చెయ్యని పవన్ కూడా శృతి హాసన్ ని మళ్లీ తీసుకొచ్చాడు. చెర్రీ కూడా రకుల్ ప్రీత్ సింగ్ ని ధృవలో రిపీట్ చేస్తున్నాడు. మహేష్ కోసం బాలీవుడ్ బ్యూటీని ట్రై చేసి చివరకు రకుల్ కి మొగ్గారు. ప్రస్తుతం ఇండస్ట్రీ జనాలు కేథరిన్ థ్రెసా - రాశి ఖన్నా - లావణ్య త్రిపాఠి వంటి కుర్ర భామలను ఎంకరేజ్ చేసే పనిలో పడ్డారు.