గుడి దగ్గర గ్లామర్ ఏంది?

Sat Jan 13 2018 00:00:01 GMT+0530 (IST)

టాలీవుడ్ లోనే కాదు.. ఏ భాషలో ఫిలిం ఇండస్ట్రీ అయినా గ్లామర్ చాలా ముఖ్యం. ఈ మధ్యన ఈ గ్లామర్ డోస్ బాగా పెరిగిపోయింది. ఆన్ స్క్రీన్ పైనే కాదు.. సోషల్ మీడియాలో కూడా గ్లామర్ రచ్చ చేస్తున్నారు. మరికొంత మంది అయితే.. ఆఫ్ స్క్రీన్ లో అందాలను కురిపించేస్తున్నారు.ఇక యాడ్స్.. ఫోటో షూట్స్ లాంటివి అయితే చెప్పాల్సిన పని లేదు. కానీ ఎక్కడ పడితే అక్కడ అందాలు ఆరబోస్తే మాత్రం కరెక్ట్ కాదనే చెప్పాలి. పలు ప్రాంతాలకు వెళ్లిపోవడం.. అక్కడ ఫోటోలు దిగేసి.. సోషల్ మీడియాలో షేర్ చేయడం సహజమే. అదేదో వెకేషన్ కు వెళ్లినపుడు అయితే.. ఆ దారి వేరు. కానీ టెంపుల్స్ కి వెళ్లినపుడు కూడా ఇలా అందాలు ఆరబోయడం మాత్రం అభ్యంతరకరమే. రీసెంట్ గా ఓ ప్రార్ధనాలయానికి.. ఓ టాలీవుడ్ హీరోయిన్ ఇలాగే గ్లామరస్ గా వెళ్లింది. నడుం ఒంపులు చూపిస్తూ చీరకట్టులో అక్కడ హంగామా చేసింది బ్యూటీ.

గుడి దగ్గర ఈ గ్లామర్ రచ్చ ఏంటో అనుకున్నారు అక్కడి భక్తులు. చీరకట్టు గ్లామర్ అవతారమే కానీ.. మరీ అదే కాన్సెప్ట్ అయితే మాత్రం తట్టుకోవడం కాసింత కష్టమే. అందుకే ఇలాంటి కామెంట్స్ వినాల్సి వచ్చింది. ఆమె ఒక్కతే కాదు.. ఇంకా మరికొందరు కూడా గతంలో ఇలాంటి హంగామానే చేశారు. ఓవరాల్ గా అందరిపైనా ఇలాంటి కామెంట్సే వినిపించాయి. మొత్తానికి అర్ధం చేసుకోవాల్సింది ఏంటంటే.. ఎక్కడైనా గ్లామర్ కి మనోళ్లు ఓటేస్తారు కానీ.. ఆధ్యాత్మిక ప్రదేశాల్లో మాత్రం ఇందుకు ఒప్పరని తెలుసుకోవాలి.