Begin typing your search above and press return to search.

బాహుబలి దెబ్బతో తప్పులే తప్పులా?

By:  Tupaki Desk   |   26 Oct 2016 10:30 PM GMT
బాహుబలి దెబ్బతో తప్పులే తప్పులా?
X
ఓ సినిమా రికార్డులు తుడిచిపెట్టేసే కలెక్షన్స్ సాధించిందంటే.. ఇక ఆ రికార్డుల అంతు చూడాల్సిన పనిని.. తమ అభిమాన హీరోల నెత్తిన పెట్టేయడం టాలీవుడ్ ఆడియన్స్ కు బాగా అలవాటు. అంతకంతకూ పెరిగిపోతున్న అంచనాలకు అనుగుణంగా భారీ స్థాయిలో బిజినెస్ లు చేసేయడం చాలా కాలంగా చూస్తున్నాం కానీ.. బాహుబలి సక్సెస్ తర్వాత ఈ జోరు బాగా పెరిగిపోయింది.

గ్రాఫిక్స్ ఆధారంగా రూపొంది.. కొత్తగా ప్రయత్నించిన బాహుబలి ప్రపంచవ్యాప్తంగా సృష్టించిన రికార్డుల జోలికి వెళ్లడం.. సాధారణ మాస్ మసాలా ఎంటర్టెయినర్లకు అసాధ్యం. కానీ తెలుగు రాష్ట్రాల వరకూ చూసుకుంటే మాత్రం బాహుబలి మరీ అందుకోలేని స్థాయి రికార్డులేమీ సృష్టించేయలేదు. అందుకే పవన్ కళ్యాణ్.. మహేష్ బాబులతో పాటు.. రీసెంట్ గా మెగాస్టార్ చిరంజీవి సినిమాపై కూడా ఈ స్థాయి అంచనాలే ఏర్పడుతున్నాయి. చిరు మూవీ ఖైదీ నెంబర్ 150కి చాలా ఏరియాల్లో బాహుబలి స్థాయిలో బిజినెస్ జరుగుతుంటే.. కొన్ని చోట్ల దానికంటే చాలా ఎక్కువ రేట్లు పలికేస్తోంది.

మహేష్-మురుగదాస్ సినిమా పరిస్థితి కూడా ఇంతే. సర్దార్ కోసం బాహుబలిని దాటే ఓ ఎటెంప్ట్ చేసిన పవన్.. మరోసారి కాటమరాయుడుతో ఆ ప్రయత్నాన్నే రిపీట్ చేయనున్నాడు. ఇంతలేసి బిజినెస్ తో ఆఫర్లు రావడం ఆయా స్టార్లను కూడా భయపెట్టేస్తోంది. ఎందుకంటే.. ఇంత బిజినెస్ చేశాక 100 కోట్ల వసూళ్లు సాధించినా అది చిన్న మొత్తమే అవుతుంది. కొంచెం తగ్గినా ఫ్లాప్ అనేయాల్సి వస్తుంది. బాహుబలి సెట్ చేసిన బెంచ్ మార్క్ ను రీచ్ అయే ప్రయత్నంలో.. మార్కెట్ రేంజ్ కి మించి అడుగులేస్తూ టాలీవుడ్ స్టార్లు పెద్ద పెద్ద తప్పులనే చేస్తున్నారనే టాక్ వినిపిస్తోంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/