Begin typing your search above and press return to search.

టాలీవుడ్ హీరోల్లో అదే మిస్సింగ్!!

By:  Tupaki Desk   |   2 Dec 2016 10:30 PM GMT
టాలీవుడ్ హీరోల్లో అదే మిస్సింగ్!!
X
మొన్న అమీర్‌ ఖాన్ ఒక వెయిట్ మేకింగ్ అండ్ రిడక్షన్ వీడియోను విడుదల చేశాడే.. అప్పటినుండి టాలీవుడ్ ఫ్యాన్స్ అందరూ తెగ అల్లాడిపోతున్నారు. అప్పట్లో మన దగ్గర సైజ్ జీరో సినిమా కోసం అనుష్క లావెక్కింది కాని.. తిరిగి సన్నబడలేదు. అయితే అంతకు ముందు కాని తరువాత కాని అసలు తమ వెయిట్ తో గేమ్స్ ఆడిన హీరోలే లేరు. అసలు మన దగ్గర అలాంటి హీరోలు మిస్సింగ్. ఎందుకలా?

గట్టిగా నాలుగు సినిమాల్లోని స్టిల్స్ పట్టుకుని.. మీరు అదే సినిమాలోదో చెప్పాలంటే మాత్రం.. కాస్త కష్టమే అవుతుంది. ఎందుకంటే దాదాపు అన్ని సినిమాల్లోనూ మన స్టార్ హీరోలోలందరూ ఒకటే తరహాలో ఉంటారు. మహా అయితే హెయిర్ స్టయిల్ మార్చడం.. లేదంటే మొన్న హాంకాంగ్ లో బట్టలు కొన్నారు కాబట్టి ఇప్పుడు దుబాయ్ లో వేరే కలక్షన్ కొనుక్కొని అది వేసుకోవడం తప్పించి.. బాడీ లాంగ్వేజ్ లో పెద్దగా మార్పులు ఏమీ ఉండవు. ఇప్పుడు దంగల్ సినిమా కోసం అమీర్‌ ఖాన్ తరహాలో అసలు వెయిట్ ను మార్చుకునో.. లేదంటే వాకింగ్ స్టయిల్ ను మార్చుకునో.. సినిమాలు చేయడం అనేదే మన టాలీవుడ్ చరిత్రలోనే లేదు.

గతంలో దేవదాసు సినిమా కోసం మాత్రం.. లవ్ ఫెయిలై మందుకు భానిసైన లుక్కులో కనిపించాలని.. హీరో అక్కినేని కొన్ని వారాలపాటు కేవలం మజ్జిగ నీళ్ళే తాగి అలా స్లిమ్ గా తయారయ్యారట. ఆ తరువాత అలాంటి ప్రయోగం చేసిన స్టార్ హీరో ఎవరు బాబూ? ఇక తమిళంలో అయితే విక్రమ్ వంటి హీరోలు 'ఐ' సినిమాలో తమ ప్రతాపం చూపనే చూపారు. మన దగ్గరు ఎవరు మరి?

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/