హీరోని కమ్మేసిన ప్రమాదకర కోటరి

Thu Nov 22 2018 20:00:01 GMT+0530 (IST)

సక్సెస్ తో ఎంత ఎత్తుకి ఎదిగినా ఒదిగి ఉండే స్వభావం యువ హీరోల్ని మరింతగా ఎదిగేలా చేస్తుంది. రంగుల ప్రపంచంలో ఎందరికో పాఠమిది. సక్సెస్ వచ్చినప్పుడు కాలర్ ఎగరేయడం - లేనప్పుడు డీలా పడిపోవడం ఇవి రెండూ సరికాదు. ఏటికి ఎదురెళ్లాల్సి ఉంటుంది ఒక్కోసారి. అన్నిటినీ ఎదురొడ్డి పోరాడితేనే నిలబడగలరు. విమర్శలకు ఎమోషన్ అవ్వడం.. పొగడ్తల్ని గొప్ప అనుకోవడం అసలే కరెక్ట్ కాదు!  ఏఎన్నార్ చెప్పినట్టు ``తెగిడేవాడి కంటే పొగిడేవాడే పెను ప్రమాదం``.  తిట్టేవాడి నుంచి చాలా నేర్చుకోవాలి. పొగిడేవాడిని దూరం పెట్టాలి! ఏ హీరో అయినా అమలు చేయాల్సిన సూత్రమిది. అయితే వరుస సక్సెస్ లతో రైజింగ్ హీరోగా దూసుకొచ్చిన ఓ యువహీరో చుట్టూ ప్రమాదకర కోటరీ ఒకటి ముసుగు కమ్మేయడం ఫిలింనగర్ సర్కిల్స్ లో చర్చకొచ్చింది.సదరు హీరో ఎంతో డౌన్ టు ఎర్త్. స్వచ్ఛమైన వ్యక్తిత్వం కలిగిన వాడు. ఉన్నమాట సూటిగా మాట్లాడే తత్వం ఉన్నవాడు. పైగా అందరినీ కలుపుకుపోయే స్వభావం తనకు ఉంది. అయితే అనూహ్యంగా పెరిగిన ఇమేజ్ తో వచ్చిన ముప్పు కూడా అతడి చుట్టూ కమ్మేసిందన్నది వాడి వేడిగా వైరల్ అవుతోంది. ఇంతకుముందు నేరుగా అతడు ఎవరితోనైనా సులువుగా ఇంటరాక్ట్ అయ్యేవాడు. కానీ ఇప్పుడు తన చుట్టూ మంది మార్బలం పెరగడంతో అతడు అందరికీ దూరమయ్యాడన్న మాట వినిపిస్తోంది. ఇంకా చెప్పాలంటే అతడిని కమ్మేసిన ఆ పైపై మెరుగుల పొర పెను ప్రమాదకరంగా మారిందిట. ఆ మబ్బు తనకే ముప్పు తెచ్చేలా పరిణమించడంపై వేడిగా చర్చ మొదలైంది.

ఆ యంగ్ హీరోని కలవాలని కానీ లేదా ఏదైనా మాట్లాడాలని - ఆఫర్ ఇవ్వాలని.. రకరకాల ప్రొఫెషనల్ వ్యవహారాల కోసం ఎవరైనా వచ్చినా చుట్టూ కమ్మేసిన ఆ కారు మబ్బును దాటుకుని వెళ్లడం చాలా కష్టమైపోతోందిట. ఇక ఈ మంది మార్బలంలోని అపరిపక్వ మబ్బులో హీరో గారి పీఏ(మేనేజర్) తీరుతెన్నులు అయితే అంతే అరాచకమని చెబుతున్నారు. ఎంతగా అంటే ఆ హీరోకి ఓ పెద్ద ఆఫర్ ఇస్తామని కలిసేందుకు ప్రయత్నిస్తే.. ముందు సదరు పీఏ అందుకు ససేమిరా అంటాడట. అయితే ఆ హీరోని కలిసేందుకు వెళ్లిన వాళ్లకు ఎందుకు ఆపుతున్నారో అసలే అర్థం కాదు. అయితే దానివెనక పెద్ద కథే ఉందని తెలుస్తోంది. హీరోతో మాట్లాడే ముందే పీఏతో డీల్ మాట్లాడాలి. కానీ మొదటిసారి వచ్చిన వాళ్లకు ఈ మధ్యవర్తిత్వ డీల్ గురించి ఏం తెలుస్తుంది?  ముందు డీల్ మాట్లాడనిదే.. పర్సంటేజీ ముట్టనిదే పనవ్వదని ఎలా తెలుస్తుంది? అయితే దానిని సదరు పీఏ నేరుగా చెప్పనే చెప్పడట. అంటే ఆ హీరో చుట్టూ కమ్మేసిన మబ్బులో పర్సంటేజీల ముప్పు కూడా దాగి ఉందని అర్థం చేసుకోవాల్సొస్తోంది. ఆ హీరో మంచితనం గురించి ఎంత బాగా చెప్పుకున్నా - చివరికి అతడి చుట్టూ చేరిన కోటరీ ముప్పు హీరోని ప్రమాదంలో పడేయడం ఖాయమని చెప్పుకోవడం ఫిలిం సర్కిల్స్ లో వేడెక్కిస్తోంది. తన చుట్టే కమ్మేసిన ఆ మబ్బులోంచి బయటికొచ్చి సదరు హీరో వాస్తవం ఏంటో చూడాలన్నది అవకాశం ఇవ్వాలని చూసిన వారి నివేదన. అవతలివాళ్లు అవకాశంతో పాటు డబ్బు కూడా ఇస్తామంటున్నారు. అదేదో ఉత్త పుణ్యానికి పనీపాటా లేక హీరోని సంప్రదించే ప్రయత్నం కానేకాదు. ఇలాంటి విషయాల్లో ఆ హీరోకు జాగ్రత్త అవసరం... తన చుట్టూ చేరిన కోటరీ ముప్పు ఎంతో గ్రహించాల్సిన అవసరం అంతే ఉంది. లొసుగు ఉంటే ముందే తెలుసుకుని కోటరీని హెచ్చరిస్తే తప్పు జరగకుండా సరిదిద్దుకునే ఛాన్సుంటుంది. అది అతడి భవిష్యత్ కే మంచిదని హెచ్చరిస్తున్నారు.