Begin typing your search above and press return to search.

అనుకున్నపుడు హిట్టే.. తర్వాతే ఫట్

By:  Tupaki Desk   |   28 May 2016 5:30 PM GMT
అనుకున్నపుడు హిట్టే.. తర్వాతే ఫట్
X
గత దసరా సీజన్ నుంచి టాలీవుడ్ లో నెగిటివ్ ట్రెండ్ బాగా ఉంది. హిట్ పర్సంటేజ్ కంటే ఫెయిల్యూర్స్ ఎక్కువైపోతున్నాయి. కొన్ని భారీ చిత్రాలు కూడా ఇండస్ట్రీని నిరాశపరిచాయి. నిర్మాతలకు నష్టాలను మిగిల్చాయి.

దసరా సీజన్ కు ముందు రామ్ నటించిన శివమ్ తో మొదలైన పరాజయాల పరంపర కొనసాగుతూనే ఉంది. పండుగ సీజన్ లో వచ్చిన రామ్ చరణ్ మూవీ బ్రూస్ లీ కి చెప్పుకోదగ్గ కలెక్షన్స్ వచ్చి 40 కోట్ల క్లబ్ లో చేరినా.. డిజాస్టర్ అనిపించుకుంది. ఆ తర్వాత దీపావళికి రిలీజ్ అయిన అక్కినేని అఖిల్ లాంఛింగ్ మూవీ అఖిల్ అయితే.. డిజాస్టర్లలో రికార్డ్ సృష్టించింది. అదే నెలలో వచ్చిన అనుష్క మూవీ సైజ్ జీరో పరిస్థితి కూడా ఇదే.

తర్వాత వరుణ్ తేజ్-పూరీ జగన్నాథ్ కాంబినేషన్ లో లోఫర్ - నిఖిల్ నటించిన శంకరాభరణంలకు సేమ్ రిజల్ట్ తప్పలేదు. సునీల్ మూవీ కృష్ణాష్టమి - నాగ చైతన్య దోచెయ్ - సందీప్ కిషన్ రన్ - మనోజ్ ఎటాక్ - అల్లరి నరేష్ బందిపోటులు కూడా నిరుత్సాహపరిచాయి.

నాగ్-కార్తీలు నటించిన ఊపిరి కంటెంట్ పరంగా సక్సెస్ అనిపించుకున్నా.. కలెక్షన్స్ పరంగా ఫెయిల్యూర్ అయింది. ఇక సమ్మర్ సీజన్ మొదలయ్యాక వచ్చాక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మూవీ సర్దార్ గబ్బర్ సింగ్.. ఇండస్ట్రీకి పెద్ద షాక్ నే ఇచ్చింది. అయితే.. డిజాస్టర్ అనిపించుకున్న సర్దార్.. 50కోట్ల క్లబ్ లో చేరడం ఆశ్చర్యకరం.

ఇక రీసెంట్ గా విడుదలైన సూపర్ స్టార్ మహేష్ బాబు మూవీ బ్రహ్మోత్సవం.. డిజాస్టర్ అవుతుందని అంచనా వేస్తున్నారు. 85 కోట్లకు పైగా బిజినెస్ చేసిన ఈ మూవీకి.. అందులో సగం కలెక్షన్స్ వచ్చే పరిస్థితి కూడా కనిపించడం లేదు. మొత్తానికి.. ఈ సినిమాలన్నిటిపైనా విడుదలకు ముందు ఖచ్చితంగా సక్సెస్ అవుతాయనే అంచనాలు ఉన్నా.. ఆ తర్వాతే కంటెంట్ ఆశించిన స్థాయిలో లేక ఫెయిల్యూర్స్ గా నిలిచాయి.