Begin typing your search above and press return to search.

తమిళ దర్శకుల నుండి తప్పక నేర్చుకోవాలి

By:  Tupaki Desk   |   29 July 2016 10:30 PM GMT
తమిళ దర్శకుల నుండి తప్పక నేర్చుకోవాలి
X
తమిళ సినిమాలు నేటివిటీకి దగ్గరగా వుంటాయి - కాస్ట్ కటింగ్ లో ప్రధమస్థానంలో ఉంటాయి లాంటి అంశాలు మనం చాలా సార్లు చర్చించుకున్నవే. తమిళనాట కూడా ఒకే మాస్ ఫార్ములాని ఫాలో అయ్యి భారీ నష్టాల్ని పొందిన సినిమాలూ వున్నాయి. ఇప్పుడు మన టాపిక్ అది కాదు. తమిళ దర్శకుల గురించి..


శంకర్ - మురగదాస్ - మణిరత్నం - లింగుస్వామి - గౌతమ్ మీనన్ - బాల.. ఈ పేర్లు తమిళనాటే కాదు, తెలుగు ఇండస్ట్రీలో కూడా పిచ్చ ఫేమస్. కోటానుకోట్ల పారితోషికం తీసుకుని అగ్రతాంబూలం అందుకున్న డైరెక్టర్ లు వీరు. అయితే అక్కడితో ఆగకుండా ఈ జాబితా అంటా స్వీయ నిర్మాణ సంస్థ పెట్టి చిన్న సినిమాలను నిర్మిస్తూ కొత్త టాలెంట్ ని ఎంకరేజ్ చెయ్యడంలో సఫలమవుతున్నారు.

ఇప్పటికే నిర్మాతగా శంకర్ 9 - మురగదాస్ 5 - లింగుస్వామి 7 - మణిరత్నం 8 - గౌతమ్ మీనన్ 5 - బాల 3 సినిమాలని నిర్మించారు దాదాపు అధిక శాతం విజయం సాధించారు. టాలీవుడ్ లో రామ్ గోపాల్ వర్మ - సుకుమార్ తప్ప ఈ తరహాలో అడుగులు వేస్తున్న పెద్ద దర్శకులు కనిపించడం లేదు. టాలెంట్ ని ఎంకరేజ్ చేస్తూ లాభాల బాట పట్టడం కూడా ఒక కళే. మనవాళ్ళు తొందరగా దీన్ని నేర్చుకుంటే మంచిది.