Begin typing your search above and press return to search.

అనగనగ ఓ దర్శకుడు కొట్టేసిన కథ

By:  Tupaki Desk   |   20 July 2017 6:06 AM GMT
అనగనగ ఓ దర్శకుడు కొట్టేసిన కథ
X
హీరోయిన్ అందాల రాశీ - కానీ చిన్నవయసులోనే పెళ్లైపోయి భర్త కూడా చనిపోతాడు. దీంతో ఎలాంటి సుఖాలు చూడకుండా అత్తవారింట్లో బంధీ అయిపోతుంది. ఆ అమ్మాయితో ప్రేమలో పడే హీరో - నానా హంగామ చేసి అత్తవారింట్లో మగ్గిపోతున్న తన ప్రేయసిని బయటకు తీసుకొచ్చేస్తాడు. కథకి శుభం కార్డ్ పడిపోతుంది. కాస్త అటు ఇటుగా ఉన్న ఇది నిన్నటితరాల్ని మెస్మరైజ్ చేసిన ప్రేమకథాచిత్రమ్ సింధూరపువ్వు. అప్పట్లో 225 రోజులు పాటు ఏకథాటిగా బాక్సాఫీస్ ను షేక్ చేసిన ఈ సినిమా కథను తాజాగా ఓ అగ్ర దర్శకుడు ఫ్రీమేక్ చేసే పనిలో బిజీగా ఉన్నాడని ఫిల్మ్ నగర్ లో వార్తలు వినిపిస్తున్నాయి.

ఈ ఫ్రిమేక్ ప్రాజెక్ట్ కోసం ఆ దర్శకుడు రైజింగ్ లో ఉన్న ఓ హాట్ బ్యూటీని హీరోయిన్ గా ఎన్నుకున్నాడట, అలానే ఏ మాత్రం క్రేజ్ లేని ఓ హీరోని ఈ కాపీ స్టోరీలోకి తీసుకున్నట్లుగా తెలిసింది. ఇంతవరకు బాగానే ఉంది కానీ ఇక్కడ విశేషమేమిటంటే, ఈ ఓల్డ్ స్టోరీతో 100 కోట్లు కలెక్షన్స్ తెస్తా అన్నట్లుగా ఆ దర్శకుడు షూటింగ్ సెట్స్ లో ఛాలెంజ్ చేస్తున్నాడట. ఇప్పటివరుకు ఆ దర్శకుడు తీసిన సినిమాలకి మిక్సిడ్ టాక్ వచ్చినప్పటికి ఏదో హీరోల ప్రభావంతో కమర్షీయల్ డైరెక్టర్ అనే పేరు తెచ్చుకున్నాడు. కానీ ఇదే భ్రమతో ఇప్పుడు ఏమాత్రం క్రేజ్ లేని హీరోతో ఓ ఓల్డ్ స్టోరీని ఫ్రిమేక్ చేయడమే కాకుండా, దానికి 40 కోట్లకి మించి బడ్జెట్ పెట్టడం - 100 కోట్లు కలెక్షన్స్ రాబడతా అంటూ ఓపెన్ స్టేట్ మెంట్స్ ఇవ్వడం హాస్యాస్పధంగా మారిందని సినీజనాలు అంటున్నారు. మరి ఈ కామెంట్స్ కు సమాధానంగా ఆ దర్శకుడు తను చెప్పినవి అన్ని నిరూపిస్తాడేమో లెట్స్ వెయిట్ సి.