ఆ ప్రాజెక్ట్ కి డైరెక్టర్ మారబోతున్నాడా?

Sat Jul 15 2017 12:04:30 GMT+0530 (IST)

క్రేజీ ప్రాజెక్ట్స్ - స్టార్ కాంబినేషన్స్ - డబ్బుకి వెనకాడని నిర్మాతలు - భారీ బడ్జెట్లు - అంగరంగ వైభవంగా ఓపెనింగ్లు - శరవేగంగా షూటింగ్లు - ఫారిన్ షెడ్యూల్స్ - భారీ ఫైట్లు - హీరో లుక్స్ లో కొత్త కొత్త మార్పులు ఇవేవి ఇప్పుడు ఆ దర్శకుడని కాపాడలేకపోతున్నాయి. ఒకప్పుడు బ్లాక్ బస్టర్లు కొట్టిన ఆ ఫిల్మ్ మేకర్ ఇప్పుడు ఓ టాప్ హీరోతో సినిమా చేస్తున్నాడు. తనదైన శైలిలో చాలా స్పీడు గా సినిమా చేసుకుంటా పోతున్నాడు. అయితే బడ్జెట్ విషయంలో మొదటి నుంచి ఆ దర్శకుడికి - సినిమా ప్రొడక్షన్ హౌస్ వాళ్లకి కాస్త మిస్ కమ్యూనికేషన్ నడుస్తోందట. ఆ దర్శకుడు కావాలని షూటింగ్ షెడ్యూల్స్ ని పొడిగించి ఖర్చు ఎక్కువ పెట్టిస్తున్నాడని తెలిసింది.

దీంతో సరైన అవకాశం కోసం ఎదురుచూస్తున్న ఆ ప్రొడక్షన్ హౌస్ వారు తాజాగా ఆ దర్శకుడు డ్రగ్స్ కేసులో ఇరుక్కోవడంతో ఎలాగైనా సినిమా నుంచి తప్పించాలని ఆ దిశగా పావులు కదుపుతున్నట్లు సమాచారం. ఈ విషయంలో హీరోదే ఫైనల్ కాల్ అట - ఒక్కసారి హీరో సైడ్ నుంచి డెసిషన్ వస్తే ఆ దర్శకుడని ప్రాజెక్ట్ నుంచి తప్పించడం ఖాయం అనే టాక్ ప్రస్తుతం ఫిల్మ్ నగర్ లో చక్కర్లు కొడుతుంది. మరి ఇప్పటివరకు అభిమానుల అంచనాల్ని పెంచిన ఆ ప్రాజెక్ట్ ఫ్యూచర్ ఏంటో లెట్స్ వెయింట్ సీ.