Begin typing your search above and press return to search.

అవార్డు ద‌ర్శ‌కుడిలో ఇదేం టెన్ష‌న్

By:  Tupaki Desk   |   27 Nov 2018 7:49 AM GMT
అవార్డు ద‌ర్శ‌కుడిలో ఇదేం టెన్ష‌న్
X
తెర‌కెక్కించిన మొద‌టి సినిమాతోనే జాతీయ స్థాయి అటెన్ష‌న్ ఉన్న‌ సినిమా తీసి శ‌భాష్ అనిపించినా... ఇంట‌ర్నేష‌నల్ ఫిలింఫెస్టివ‌ల్స్‌ లో స‌త్తా చాటుకున్నా.. ఉత్త‌మ ద‌ర్శ‌కుడు అవార్డు స‌హా 7 నందులు ద‌క్కినా అది క‌మ‌ర్షియ‌ల్‌ గా ఫెయిలైతే!! ఆ టెన్ష‌నే వేరు... ప్రాంతీయ కేట‌గిరీలో దేశం త‌ర‌పున ఆస్కార్ నామినేష‌న్ ద‌శ‌కు చేరుకుని చివ‌రిలో జ‌స్ట్ మిస్స‌యింది. అంత గొప్ప సినిమా తీసిన ద‌ర్శ‌కుడు ఆ త‌ర్వాత ఇంకెలాంటి సినిమా తీస్తాడో అనుకుంటామా లేదా? కానీ అక్క‌డే అచ్చులో బొమ్మ తిర‌గ‌బ‌డింది. తొలి సినిమాతో సంపాదించుకున్న‌ది జీరో. సొంతంగా ఉన్న డ‌బ్బు అంతా పెట్టినందుకు ఆర్థికంగా న‌ష్టం త‌ప్ప‌లేదు. అంద‌రూ గొప్ప సినిమా అని పొగిడేసిన వాళ్లే కానీ - పొగిడిన వాళ్లు కూడా ఆ సినిమా చూడ‌లేదు చివ‌రికి. కొన్నిసార్లు రంగుల ప్ర‌పంచంలో వింతైన స‌న్నివేశం ఇలానే ఉంటుంది. కుడి ఎడ‌మైతే పొర‌పాటు లేదోయ్‌! ఓడిపోలేదోయ్‌! అన్నారు పెద్ద‌లు. ఒక్కోసారి అనుకున్న‌దొక్క‌టి అయిన‌దొక్క‌టి! అన్న చందంగా సీన్ మొత్తం రివ‌ర్స‌యినా త‌ట్టుకోవాలిక్క‌డ‌. తానొక‌టి త‌లిస్తే అన్న చందంగానే ఉంటుంది సీన్.

తొలి సినిమా అనుభ‌వంతో అవార్డులు - క్రిటిక్స్ ప్ర‌శంస‌లు దేవుడెరుగు నాకు అర్జెంటుగా ఓ క‌మ‌ర్షియ‌ల్ హిట్టు కావాల‌ని రియ‌లైజ్ అయ్యి.. మ‌రో ప్ర‌య‌త్నం చేశాడు ఆ ద‌ర్శ‌కుడు. అయితే ఈ ప్ర‌య‌త్నం అయినా ఫ‌లించిందా? అంటే ఇదీ బెడిసి కొట్టింది. ఈరోజుల్లో త‌ర‌హాలో ఏదైనా మ్యాజిక్ చేస్తే ఎలా ఉంటుంది? అనుకుని అలాంటి వైబ్రేంట్‌ గా ముద్దు ముద్దైన టైటిల్ పెట్టుకుని సినిమా తీస్తే మ‌ళ్లీ అదే ఫ‌లితం. అస‌లు థియేట‌ర్ల వైపు ఆడియెన్ వెళితేనే కదా.. త‌న‌లో ఆనందం క‌నిపించేది. కానీ అక్క‌డ స‌న్నివేశం ఇబ్బందిక‌రం అని తేలిపోయింది. అంత‌కుమించి పుండు మీద కారంలాగా .. ఆ సినిమాపై రివ్యూల్లో క్రిటిక్స్ విరుచుకుప‌డ‌డం మ‌రింతగా సన్నివేశాన్ని దిగ‌జార్చింది. చేసిన త‌ప్పుల్ని ఎత్తి చూపిన క్రిటిక్స్ పై కోపం వ‌చ్చినా - తాము చేసిన త‌ప్పును స‌రిదిద్దుకుంటాం అంటూ ఆ సినిమాలో ల్యాగ్ మొత్తం క‌ట్ చేసి తిరిగి క్యూబ్ రీలోడ్ చేసి థియేట‌ర్ల‌లో రిలీజ్ చేస్తున్నార‌ట‌. అయితే జ‌ర‌గాల్సిన డ్యామేజ్ ఇప్ప‌టికే జ‌రిగిపోయింది. పైగా టీవీ ల్లో డిబేట్లు పెట్టి ఆ సినిమాలో నెగెటివిటీని విప‌రీతంగా ప్ర‌చారం చేయించ‌డంతో అది పాజిటివ్ అవుతుంద‌నుకుంటే అది కాస్తా నెగెటివ్ అయ్యి ఫ్యామిలీ ఆడియెన్‌ ని థియేట‌ర్ల‌కు రాకుండా చేసిందట‌. ఈ విష‌యాల్ని అయినా దాచారా? అంటే అస‌లే క‌లెక్ష‌న్లు లేక ఆందోళ‌న‌లో మ‌ళ్లీ స‌క్సెస్ మీట్ అంటూ మీడియా ముందుకు వ‌చ్చి అన్ని విష‌యాల్ని లీక్ చేసేశారు. దాంతో అది కాస్తా ఫెయిల్యూర్ మీట్ అయ్యింది.

ఏదేమైనా సినిమా బ‌త‌కడం ఇంపార్టెంట్. అందుకే కంగారులో చేసే త‌ప్పిదాల్ని ఎత్తి చూప‌డం ఉద్దేశం కాదు కానీ, వాటిని స‌రి చేసుకుని జాగ్ర‌త్త‌గా ఉండ‌డ‌మే ఈ రంగుల ప్ర‌పంచంలో అవ‌స‌రం అని చెప్ప‌డ‌మే మీడియాల‌ అస‌లు ఉద్ధేశ‌మ‌ని గ్ర‌హిస్తే అంతే చాలు.