టాలీవుడ్ కమెడియన్ విజయ్ ఆత్మహత్య

Mon Dec 11 2017 12:52:08 GMT+0530 (IST)

టాలీవుడ్‌లో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ హాస్యనటుడు విజయ్ అలియాస్ పొట్టి ప్రసాద్ ఆత్మహత్య చేసుకున్నారు. హైదరాబాద్ యూసఫ్ గూడలోని తన ఫ్లాట్ లో ఆయన శవమై కనిపించారు. కొన్నాళ్లుగా అవకాశాలు లేకపోవడం - అప్పుల బాధ - ఆర్థిక వివాదాలు వంటివి ఆయన ఆత్మహత్యకు కారణాలుగా చెప్తున్నారు.
    
అమ్మాయిలు అబ్బాయిలు సినిమాతో పాపులారిటీ తెచ్చుకున్న ఆయన 'బొమ్మరిల్లు' వంటి సూపర్ హిట్ చిత్రంలోనూ నటించారు. సినిమాల్లో అవకాశాలు లేకపోవడం - ఎంతగా శ్రమించినా బ్రేక్ రాకపోవడంతోనే విజయ్ ఆత్మహత్యకు పాల్పడినట్టు తెలుస్తోంది. విజయ్ కొంతకాలంగా డిప్రెషన్ తో బాధపడుతున్నాడని స్నేహితులు వెల్లడించారు.
    
స్నేహితులతో కలసి అపార్టుమెంటులో ఉంటున్న విజయ్ - ఎవరూ లేని సమయంలో ఆత్మహత్య చేసుకున్నాడు. విజయ్ మృతి గురించి తెలుసుకున్న ఇందిరానగర్ - కృష్ణానగర్ - యూసుఫ్ గూడ ప్రాంతాల్లోని పలువురు జూనియర్ ఆర్టిస్టులు - ఆయనతో తమ అనుబంధాన్ని గుర్తు చేసుకుంటున్నారు.  గుర్తుండి పోయే క్యారెక్టర్లు చేసినా - సరైన అవకాశాలు రాక - ఆర్థిక ఇబ్బందుల్లో పడిపోయిన విజయ్ అఘాయిత్యానికి పాల్పడినట్లు చెప్తున్నారు.