టాలీవుడ్ తారల వెనకున్న మహిళలు

Wed Mar 08 2017 23:18:57 GMT+0530 (IST)

మహిళా దినోత్సవం సందర్భంగా అనేక మంది సెలబ్రిటీలు తమకు అండగా నిలిచిన మహిళామూర్తులను గుర్తు చేసుకున్నారు. టాలీవుడ్ తారలు కూడా.. తమ జీవితంలోని అద్భుతమైన మహిళల గురించి చెప్పుకొచ్చారు. స్టార్లు.. సెలబ్రిటీల ట్వీట్స్ ను ఓసారి చూద్దాం.

తల్లి.. కూతురు ఫోటోలను పోస్ట్ చేసిన మహేష్ బాబు  "అందంగా ఉండాలి.. ప్రేమతో ఉండాలి.. గౌరవంతో ఉండాలి.. గర్వంగా ఉండాలి.. సంతోషంగా ఉండాలి. ఆశ్చర్యమే అయినా ఎప్పటికి నిలిచి ఉండే స్ఫూర్తిని నింపిన ప్రపంచంలోని మహిళలు అందరికీ.. ప్రపంచ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు" అన్నాడు

తల్లి.. భార్య కలిసి ఉన్న ఫోటోను ట్వీట్ చేసిన జూ. ఎన్టీఆర్.. "మనతో ఉండే మహిళలను సంతోషంగా ఉంచడమే అసలైన ఆనందం. మహిళా దినోత్సవ స్ఫూర్తిని జరుపుకుంటున్న సందర్భంగా.. నా జీవితంలోని ఇద్దరు అతి ముఖ్యమైన మహిళలు" అన్నాడు.

తల్లి.. భార్య.. కూతురు కలిసి ఉన్న ఫోటోను పోస్ట్ చేసిన నందమూరి కళ్యాణ్ రామ్.. "నా జీవితంలో అత్యంత విలువైన మహిళలతో స్త్రీ శక్తి స్ఫూర్తిని వేడుకగా జరుపుకుంటున్నా" అన్నాడు.

రాష్ట్రపతి చేతుల మీదుగా అవార్డు అందుకునేందుకు ముందు క్షణాల్లో.. భార్య అమల ఫోటోను పోస్ట్ చేసిన అక్కినేని నాగార్జున.. "ప్రియమైన అమలను చూస్తే నాకెంతో గర్వంగా ఉంటుంది. సమాజానికి స్వార్ధం లేని సేవలు చేసినందుకు గాను.. రాష్ట్రపతి చేతుల మీదుగా తాను నారీ శక్తి పురస్కారాన్ని అందుకుంది" అని ట్వీట్ చేశాడు.

అమల అవార్డ్ అందుకున్న ఫోటోను పోస్ట్ చేసిన సుశాంత్.. "అమల అత్తను చూస్తే మాకెంతో గర్వంగా ఉంటుంది. స్త్రీ మరియు శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ నుంచి నారీ శక్తి పురస్కారాన్ని అందుకుంది" అన్నాడు.

తనకు అవార్డ్ వచ్చినపుడు.. ఆ అవార్డ్ తల్లి చేతుల్లో ఉన్నపుడు.. ఆ ఆనందంలో ఆమె మునిగిపోయిన ఉన్న ఫోటోను పోస్ట్ చేసిన సాయిధరం తేజ్.. "నా శక్తికి మూలం.. మహిళలను గౌరవించమని తను నాకు నేర్పింది. నేను నీ నీడను అయినందుకు లవ్ యూ అమ్మా. అందుర స్త్రీలకు మహిళా దినోత్సవ శుభాకాంక్షలు" అని ట్వీట్ చేశాడు.

తల్లి.. భార్య.. ఇద్దరు కూతుళ్ల ఫోటోలను పోస్ట్ చేసిన మంచు విష్ణు.. "ఇక్కడ కనిపిస్తున్న అందమైన.. శక్తివంతులైన.. అధ్భుతమైన మహిళలకు హ్యాపీ ఉమెన్స్ డే" అని పోస్ట్ చేశాడు.

"ఈ మహిళలు నా జీవితంలో ఉన్నందుకు చాలా ఆనందంగా ఉంది" అంటూ తన లైఫ్ లోని ముగ్గురు మహిళలు అయిన.. భార్య.. సోదరి.. కూతురు ఉన్న ఫోటోను పోస్ట్ చేశాడు కోన వెంకట్.

"తను సంతోషంగా ఉంటే.. నువ్వు సంతోషంగా ఉన్నట్లే" అంటూ woman అని రాసి ఉన్న ఓ ఆకట్టుకునే లోగో టైప్ డిజైన్ ను పోస్ట్ చేశాడు సంపూర్ణేష్ బాబు.