మేము మిమ్ములను నమ్మాం

Tue Dec 11 2018 22:23:21 GMT+0530 (IST)

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ ఎస్ విజయం నేపథ్యంలో సినీ పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖులు స్పందిస్తున్నారు. టీఆర్ ఎస్ పార్టీకి - కేసీఆర్ - కేటీఆర్ పై సినీ ప్రముఖుల ప్రశంసల జల్లు కురుస్తోంది. టీఆర్ ఎస్ దూకుడుతో తెలంగాణలో రెండవ సారి అధికారాన్ని దక్కించుకుంది. టీఆర్ ఎస్ గెలుపుపై రామ్ మరియు సందీప్ కిషన్ లు స్పందించారు.సందీప్ కిషన్ ట్విట్టర్ లో... ఇది ఛారిత్రాత్మక విజయం రాష్ట్ర ప్రజలు హైదరాబాద్ ప్రజలు మేము మిమ్ములను నమ్మాం మీపైన నమ్మకం ఉంచాం. కేటీఆర్ గారు మరియు కేసీఆర్ గారు మీకు హృదయపూర్వక అభినందనలు అంటూ ట్వీట్ చేశాడు.

రామ్ ట్విట్టర్ లో... విజయంపై మీ నమ్మకం సూపర్ - మీరు మళ్లీ అధికారంలోకి వచ్చినందుకు శుభాకాంక్షలు. మీకు ఈ విజయం పూర్తిగా అర్హనీయం. ఈ విజయంతో మీరు రాష్ట్రాన్ని మరింతగా అభివృద్ది చేస్తారని నమ్ముతున్నాను అంటూ ట్వీట్టర్ ద్వారా తన కామెంట్స్ చేశాడు.

రవితేజ ట్విట్టర్ లో... ఎన్నికల్లో విజయాన్ని దక్కించుకున్న కేటీఆర్ మరియు హరీష్ రావులకు శుభాకాంక్షలు చెప్పాడు.

అఖిల్ అక్కినేని ట్విట్టర్ లో... ఈ విజయానికి మీరు అర్హులు శుభాకాంక్షలు.