Begin typing your search above and press return to search.

రంగస్థలం రచ్చ మొదలయ్యింది

By:  Tupaki Desk   |   9 Dec 2017 9:43 AM GMT
రంగస్థలం రచ్చ మొదలయ్యింది
X
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ - సుకుమార్ కాంబినేషన్ లో తెరకెక్కుతోన్న రంగస్థలం ఫస్ట్ లుక్ దర్శనం ఎట్టకేలకు సక్సెస్ అయ్యింది. ఫస్ట్ లుక్ లో రామ్ చరణ్ తన స్టార్ ఇమేజ్ ని సైతం పక్కనపెట్టేసి ఊర మాస్ రేంజ్ లో స్టీల్ ఇచ్చాడు. ప్రస్తుతం ఫస్ట్ లుక్ పోస్టర్ సోషల్ మీడియాలో చాలా వైరల్ అయ్యింది. కరెక్ట్ గా ఒక నిమిషం అటు ఇటు కాకుండా చిత్ర యూనిట్ 9 గంటలకు ఫస్ట్ లుక్ ని రిలీజ్ చేయగా ఇప్పుడు లైకులతో షేర్లతో రచ్చ చేస్తోంది.

ఇకపోతే రిలీజ్ అయినా కొద్దీ నిమిషాలకే కొంతమంది తారలు ఫస్ట్ లుక్ ని వారి ట్విట్టర్ ఎకౌంట్ లో కూడా పోస్ట్ చేసి ప్రమోషన్స్ స్థాయిని పెంచారని చెప్పాలి. చిన్న సినిమా వచ్చినా పెద్ద సినిమా వచ్చినా సినిమా కంటెంట్ బావుంటే ప్రశంసించే పరుచూరి గోపాల కృష్ణ చిత్ర యూనిట్ ని ప్రశంసించారు.

రంగస్థలం ఫస్ట్ లుక్ కళాత్మకంగా ఆలోచనాత్మకంగా వుంది. చిత్ర యూనిట్ కి ఆల్ ది బెస్ట్ అంటూ తన కలంతో ఓ ట్వీట్ వదిలారు. ఇక అల్లు హీరో శిరీష్ కూడా తనదైన శైలిలో స్పందించాడు.

ఈ లుక్ లో చాలా బావున్నావ్ బ్రో.. స్క్రీన్ పై కొత్త తరహాలో కనిపించబోతోన్న రంగస్థలం సినిమాను చూడాలని ఉంది అని శిరీష్ ట్వీట్ చేశాడు. ఇక మెగా హీరో వరుణ్ తేజ్ కూడా తన స్టైల్ లో చిట్టి బాబు అని సంబోధిస్తూ.. ఇది అసలైన మేకోవర్ అనే విధంగా స్పందించాడు. అలాగే కామెడీ హీరో సునీల్ కూడా చాలా సింపుల్ గా పోస్టర్ ని పోస్ట్ చేసి సూపర్ అనేశాడు.