Begin typing your search above and press return to search.

డ్రగ్స్ పుచ్చుకున్నారని కాదట..

By:  Tupaki Desk   |   16 July 2017 6:26 AM GMT
డ్రగ్స్ పుచ్చుకున్నారని కాదట..
X
మన దేశంలో చట్టాలు కాస్త వింతగానే ఉంటాయి. వ్యభిచారం చేయించడం నేరం కాని.. వ్యభిచారం చేసినవారిని మాత్రం బాధితులుగానే చూస్తాయి మన చట్టాలు. అలాగే డ్రగ్స్ అమ్మడం నేరం కాని.. డ్రగ్స్ కు భానిసలు అయినవారిని మాత్రం బాధితులగానే చూస్తారు. అందుకే ఇప్పుడు టాలీవుడ్ లో చాలామందికి నోటీసులు పంపించడం పై ఒక వింత చర్చ మొదలైంది.

నిజానికి నోటీసులు అందుకున్న 12 మంది సెలబ్రిటీలు కేవలం డ్రగ్స్ పుచ్చుకుంటుంటే మాత్రం.. వారికి కౌన్సిలింగ్ ఇచ్చి వదిలేశేవారు. ఎందుకంటే వారు బాధితులు కాబట్టి. కాని ఇక్కడ మ్యాటర్ అది కాదట. వీరు పుచ్చుకోవడం కాదు విక్రయిస్తున్నారు అంటున్నారు మీడియా రిపోర్టులు. అంటే డబ్బులు సంపాదించడానికి వీరు డ్రగ్స్ అమ్మట్లేదు కాని.. పెద్ద పెద్ద పార్టీల కోసం వీరు భారీ ఎత్తులో డ్రగ్స్ కొనుగోలు చేసి.. వాటిని పార్టీల్లో తమ ట్రీట్ టైపులో అందరికీ అంటగట్టేస్తున్నారట. ఫ్రీగానే ఇచ్చినా కూడా ఇలా ఇతరులను డ్రగ్స్ తీసుకోమంటూ పాడుచేయడం సబబు కాదు. అందుకే ఎక్సయిజ్ శాఖ వీరిపై చర్యలు తీసుకోవాలని.. ముందుగా విచారణకు హాజరై వివరణ ఇవ్వాలని నోటీస్ ఇచ్చినట్లు మీడియాలో కథనాలు వస్తున్నాయి.

ఇకపోతే డ్రగ్స్ కేసులో ఎవరికి నోటీసులు ఇచ్చిందీ ఎక్సయిజ్ శాఖ చెప్పట్లేదు. నోటీసులు అందుకున్న వారేమో మేం అమాయకులం అనే చెబుతున్నారు. కొందరైతే నోటీసులే రాలేదన్నారు. అసలు ఈ కేసు చివరకు ఎన్ని మలుపులు తిరుగుతుందో ఏ వంక దగ్గర ఆగుతుందో తెలియక ఇప్పుడు ఆడియన్స్ కూడా షాకవుతున్నారు. అది సంగతి.