Begin typing your search above and press return to search.

హైదరాబాద్ సంచలనం..మన తారలు ఫుల్ హ్యాపీస్

By:  Tupaki Desk   |   30 May 2016 5:00 AM GMT
హైదరాబాద్ సంచలనం..మన తారలు ఫుల్ హ్యాపీస్
X
సీజన్ లో రెండు వరుస ఓటములతో ప్రస్తానం మొదలుపెట్టిన సన్ రైజర్స్ హైదరాబాద్ చివరికి ఛాంపియన్ గా నిలుస్తుందని ఊహించిన వారు తక్కువే. అయితే అద్భుత పోరాటపటిమతో కాప్టైన్ వార్నర్ భీకర్ ఫామ్ తో మన వాళ్ళు ఐ.పి.ఎల్ కప్పుని సాధించారు.

ఈ విజయాన్ని మన తెలుగు తారలు కూడా బాగానే సెలెబ్రేట్ చేసుకుంటున్నారు. మన హీరోలలో వెంకటేష్ - అఖిల్ - నిఖిల్ లకి క్రికెట్ అంటే ఎంత పిచ్చో చెప్పనవసరం లేదు. హైదరాబాద్ లో జరిగిన ప్రతీమ్యాచ్ కి వీరు హాజరయ్యి టీమ్ ని సపోర్ట్ చేశారు.

అయితే నిన్న బెంగుళూరులో జరిగిన మ్యాచ్ కి సైతం వెంకీ - సుమంత్ - అల్లు శిరీష్ లు వెళ్ళి అక్కడ హైదరాబాద్ జట్టు కు మద్దతునివ్వడం వారి ప్రేమను రుజువుచేసింది. హైదరాబాద్ ఆటగాడు కట్టింగ్ కొట్టిన సిక్స్ కి వెంకీ ఇచ్చిన రియాక్షన్ - చేసిన అల్లరి తన సినిమా విజయాలకు సైతం చేసి వుండదు.. అదన్నామాట.. మొత్తానికి కంగ్రాట్స్ ఎస్.ఆర్.హెచ్... ఫ్రమ్ తెలుగు ఫిలిం ఇండస్ట్రీ ఫ్యాన్స్...