Begin typing your search above and press return to search.

ప‌వ‌న్ బ‌ర్త్‌ డే:వాడుకున్నోళ్ల‌కి వాడుకొన్నంత‌!

By:  Tupaki Desk   |   2 Sep 2015 8:07 AM GMT
ప‌వ‌న్ బ‌ర్త్‌ డే:వాడుకున్నోళ్ల‌కి వాడుకొన్నంత‌!
X
ఇదివ‌ర‌కు ఓ క‌థానాయ‌కుడి పుట్టిన‌రోజు అంటే ఆయ‌న అభిమానులో లేక కుటుంబ స‌భ్యులో స‌న్నిహితులో సంబ‌రాలు చేసుకొనేవాళ్లు. కానీ ఇప్పుడు ఆ ట్రెండ్ మారింది. ఫేమ‌స్ హీరోల పుట్టిన‌రోజుల్ని ఎవ‌రికి న‌చ్చిన రీతిలో వాళ్లు వాడుకోవ‌డం అల‌వాటు చేసుకొన్నారు. సోష‌ల్ నెట్‌ వ‌ర్కింగ్ అందుబాటులోకి వ‌చ్చాకే ఇలా మారింది ప‌రిస్థితి. ముఖ్యంగా ఇండ‌స్ట్రీలో త‌మ త‌మ సినిమాల ప్ర‌మోష‌న్ల‌కు స్టార్ హీరోల పుట్టిన‌రోజుల్ని బాగా ఉప‌యోగించుకొంటున్నారు. ఈసారి చిరంజీవి, ప‌వ‌న్‌ క‌ళ్యాణ్‌ ల పుట్టిన‌రోజులు వాడుకొన్నోళ్ల‌కు వాడుకొన్నంత చందంగా అనిపించాయి. ఇటీవ‌ల జ‌రిగిన చిరంజీవి పుట్టిన‌రోజును పుర‌స్క‌రించుకొని ప‌లు సినిమాల పోస్ట‌ర్ల‌ పై హ్యాపీ బ‌ర్త్ డే టు మెగాస్టార్ అంటూ విషెస్ క‌నిపించాయి.

ప‌వ‌న్‌ క‌ళ్యాణ్ పుట్టిన‌ రోజైన ఈ రోజు కూడా సినిమాల పోస్ట‌ర్ ల‌లోనూ, ప్ర‌చార చిత్రాల్లోనూ ప‌వ‌ర్‌ స్టార్ ఫొటోలు విరివిగా ద‌ర్శ‌న‌మిస్తున్నాయి. ప్ర‌త్యేక‌మైన టీజ‌ర్లు, పాట‌ల‌తో సోష‌ల్ నెట్‌ వ‌ర్కింగ్‌ సైట్లు హోరెత్తిపోతున్నాయి. ప‌వ‌న్ పుట్టిన‌రోజు సంద‌ర్భంగా రామ్‌ చ‌ర‌ణ్‌, సాయిధ‌ర‌మ్ తేజ్‌, వ‌రుణ్‌ తేజ్ సినిమాల‌కి సంబంధించి ప్ర‌త్యేక‌మైన టీజ‌ర్ లు, ట్రైలర్ లు విడుద‌ల‌య్యాయి. వాళ్లంటే కుటుంబ స‌భ్యులు కాబ‌ట్టి ఓకే అనుకోవ‌చ్చు. కుటుంబ స‌భ్యులు కానివాళ్లు కూడా త‌మ సినిమాల‌కి సంబంధించిన టీజ‌ర్ లు విడుద‌ల చేసి ప‌వ‌న్‌ పై అభిమానాన్ని చాటుకొన్నారు. అఫ్‌ కోర్స్ ప‌వ‌న్‌ క‌ళ్యాణ్‌ కి ఇండస్ట్రీ నిండా అభిమానులే వున్నారు. అయితే ఇదివ‌ర‌కు మాత్రం ఇలా బ‌య‌ట‌ప‌డేవాళ్లు కాదు. కానీ ఇటీవ‌ల మాత్రం బ‌హిరంగంగా త‌మ అభిమానాన్ని ప్ర‌ద‌ర్శిస్తూ పోస్ట‌ర్ ల‌పై విషెస్ చెబుతూ సంద‌డి చేస్తున్నారు. `శంక‌రాభ‌ర‌ణం` మొద‌లుకొని ఇంకా నాలుగైదు చిన్న సినిమాల‌కి సంబంధించిన పోస్ట‌ర్ ల‌లోనూ, టీజ‌ర్ ల‌లోనూ ప‌వ‌న్‌ క‌ళ్యాణ్ క‌నిపిస్తుండ‌డం విశేషం. ట్విట్ట‌ర్‌ లో అయితే బోలెడుమంది సెల‌బ్రిటీలు ప‌వ‌న్ క‌ల్యాణ్‌ తో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకొంటూ విషెస్ చెబుతున్నారు.