Begin typing your search above and press return to search.

వాల్మీకి' పై ఆ కులం పోరాటం..!

By:  Tupaki Desk   |   9 Sep 2019 1:50 PM GMT
వాల్మీకి పై ఆ కులం పోరాటం..!
X
'వాల్మీకి' సినిమాపై వాల్మీకుల పోరాటం కొనసాగుతూ ఉంది. తమ కులాన్ని కించపరిచేలా ఈ సినిమా కథాంశం ఉందని వారు ఆరోపిస్తూ వస్తున్నారు. తమిళంలో రౌడీయిజం గురించి తీసిన ఒక సినిమా ఆధారంగా ఇది రూపొందుతూ ఉందని, అలాంటి సినిమాకు 'వాల్మీకి' అంటూ టైటిల్ పెట్టడం ఏమిటని వారు ఆక్షేపిస్తూ ఉన్నారు.

రామాయణ రచయిత అయిన వాల్మీకి అంతకు ముందు బోయగా మెలిగాడు. వేటాడుతూ జీవనం సాగించాడు. బోయ పేరుతో తెలుగు సమాజంలో ఒక కులం కూడా ఉంది. బోయలు- వాల్మీకులు పేరుతో ఆ కులం కొనసాగుతూ ఉంది. వాళ్లే ఇప్పుడు ఈ సినిమా మీద అభ్యంతరాలు చెబుతూ ఉన్నారు.

సినిమాల పై కులాల అభ్యంతరాలు కొత్తవి ఏమీ కావు. అయితే ఈ సినిమాకు మరింత ప్రత్యేకం. ఆల్రెడీ తమిళంలో 'జిగర్ తాండా' పేరుతో ఈ సినిమా వచ్చిందని, అందులో రౌడీయిజం కథాంశంగా ప్రస్తావించారని - ఇప్పుడు అదే సినిమాను తెలుగులో తీస్తూ..తమ కులం పేరును - మహర్షి వాల్మీకి పేరును వాడుకోవడం ఏమిటని వాల్మీకులు ప్రశ్నిస్తూ ఉన్నారు.

దీని వల్ల వాల్మీకికి, తమ కులానికి చెడ్డపేరు వచ్చే అవకాశం ఉందని..ఈ సినిమా టైటిల్ మార్చాలని వారు డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఈ మేరకు వారి ఫిర్యాదులు కొనసాగుతూ ఉన్నాయి.