Begin typing your search above and press return to search.

బ్రూస్‌ లీ కూతురి ప్రేమ‌లో టైగ‌ర్ ష్రాఫ్‌

By:  Tupaki Desk   |   21 Sep 2018 4:58 AM GMT
బ్రూస్‌ లీ కూతురి ప్రేమ‌లో టైగ‌ర్ ష్రాఫ్‌
X
బాలీవుడ్ రైజింగ్ హీరో టైగ‌ర్ ష్రాఫ్ .. హాలీవుడ్ మార్ష‌ల్ కింగ్ బ్రూస్‌ లీ కూతురితో ప్రేమ‌లో ప‌డ్డాడా? అంటే .. ఎస్ అనే చెబుతున్నారు. అంతేకాదు బ్రూస్‌లీ కుమార్తె షానోన్ లీతో ఓ సినిమాలోనూ అత‌డు న‌టిస్తున్నాడు. అస‌లింత‌కీ ఆ ఇద్ద‌రి మ‌ధ్యా ల‌వ్వాయ‌ణం ఏంటి? అయినా టైగ‌ర్ బోయ్‌.. `లోఫ‌ర్` బ్యూటీ - `భాఘి 2` ఫేం దిశా ప‌టానీతో ప్రేమ‌లో ఉన్నాడు క‌దా? అంటారా.. అయితే చెక్ డీటెయిల్స్...

అవును.. టైగ‌ర్ ష్రాఫ్ ల‌వ్‌ లో ఉన్నాడు. అది కూడా దిశా ప‌టానీతోనే. అయితే అంత‌కుమించి అత‌డి అబ్సెస‌న్ హాలీవుడ్‌ పై ఉంది. ఏనాటికైనా సిల్వ‌స్ట‌ర్ స్టాలోన్ అంత‌టి పెద్ద హాలీవుడ్ స్టార్ అవ్వాల‌ని క‌ల‌లుగంటున్నాడు. అత‌డి స్ఫూర్తితోనే కండ‌లు పెంచాడు. మార్ష‌ల్ ఆర్ట్స్‌ లో శిక్ష‌ణ పొందాడు. స్టాలోన్ న‌టించిన ర్యాంబో చిత్రాల్ని రీమేక్ చేయాల‌నుకుంటున్నాడు. అలానే ఇప్పుడు త‌న హాలీవుడ్ క‌ల‌ల్ని నిజం చేసుకునేందుకు ప్ర‌య‌త్నాలు చేస్తున్నాడు. అలా అత‌డి ప్ర‌య‌త్నం ఎట్ట‌కేల‌కు ఫలించింది. `మోర్ట‌ల్ కోంబాట్‌` లాంటి భారీ యాక్ష‌న్ చిత్రాన్ని నిర్మించిన లారెన్స్ క‌స‌నాఫ్ (లారీ) ఇటీవ‌లే ముంబై వ‌చ్చి ష్రాఫ్ బోయ్‌ ని త‌న త‌దుప‌రి చిత్రానికి హీరోగా ఎంపిక చేసుకున్నాడు. అందుకు టైగ‌ర్‌ని రిక‌మండ్ చేసిందెవ‌రో తెలుసా? 400 చిత్రాల్లో న‌టించిన ప్ర‌ఖ్యాత న‌టుడు గుల్ష‌న్ గ్రోవ‌ర్ త‌న‌యుడు సంజ‌య్ గ్రోవ‌ర్ అందుకు సాయం చేశాడు. సంజ‌య్ చిన్న‌ప్ప‌టి నుంచి టైగ‌ర్ ష్రాఫ్‌ కి స్నేహితుడు. స్కూల్లో బెంచ్‌ మేట్స్‌. ఇక ఈ చిత్రంలో బ్రూస్‌ లీ కుమార్తె షానోన్ లీ క‌థానాయిక‌గా న‌టించ‌నుంది. అంటే టైగ‌ర్‌ ష్రాఫ్ - షానోన్ లీ జంట‌గా ఈ చిత్రాన్ని లారెన్స్ కాస‌నోఫ్ నిర్మిస్తున్నారు. టైగ‌ర్ న‌టించిన `భాఘి 2` చూసిన లారెన్స్ స్పెల్ బౌండ్ అయిపోయార‌ట‌. అంతేకాదు ఇండియా నుంచి ఒక ఫ్రెష్‌ హీరోని త‌న సినిమాకి ఎంపిక చేసుకోవాలంటే అందుకు ఏకైక ఆప్ష‌న్ టైగ‌ర్ మాత్ర‌మేన‌ని ఫిక్స‌య్యాడ‌ట‌. ష్రాఫ్ బోయ్ ఇప్ప‌టికే మార్ష‌ల్ ఆర్ట్స్‌ లో పూర్తి శిక్ష‌ణ పొంది - బాడీ లాంగ్వేజ్ ప‌రంగానూ ఇంట‌ర్నేష‌న‌ల్ లుక్‌ తో ఉన్నాడు. భారీ స్టంట్స్ చేయ‌డంలో అతడికి సాటిలేరెవ‌రూ. అందుకే టైగ‌ర్‌ని ఫిక్స‌యిపోయాడ‌ట‌.

ఇక ఈ చిత్రానికి క‌థ అందిస్తోంది ఎవ‌రో తెలుసా? ఎమ్మీ అవార్డు గ్ర‌హీత‌ - `బ్యాట్‌ మ్యాన్` సిరీస్ ర‌చ‌యిత సీన్ కేథ‌రిన్ డెరెక్ స్క్రిప్టు అందిస్తున్నారు. టైగ‌ర్ స్నేహితుడు సంజ‌య్ గ్రోవ‌ర్‌ తో క‌లిసి నిర్మాత లారెన్స్ - ర‌చ‌యిత సీన్ ముంబైలో మంత‌నాలు సాగించారు. ఇక సంజ‌య్ గురించి చెప్పాలంటే అత‌డు బాండ్ ఫ్రాంఛైజీ సినిమాలు స‌హా ది హాబిట్ - జూకీప‌ర్ వంటి చిత్రాల‌కు ర‌క‌ర‌కాల విభాగాల్లో ప‌ని చేసి హాలీవుడ్ కాంటాక్టుల్ని సంపాదించాడు. అదిప్పుడు స్నేహితుడు టైగ‌ర్‌ కి పెద్ద రేంజులోనే వ‌ర్క‌వుటైంది. ఇక సినిమాలో హీరో- హీరోయిన్ జంట ప్రేమ‌లో ప‌డ‌డం స‌హ‌జ‌మే. అంటే ష్రాఫ్ .. తొంద‌ర్లోనే షానోన్‌ తో ప్రేమ‌లో ప‌డ‌బోతున్నాడ‌న్న‌మాట‌!!