Begin typing your search above and press return to search.

హ్యాట్రిక్ డైరెక్టర్ కి బహుమతిగా బెంజ్

By:  Tupaki Desk   |   21 Jun 2017 5:17 AM GMT
హ్యాట్రిక్ డైరెక్టర్ కి బహుమతిగా బెంజ్
X
జాకీ ష్రాఫ్ కుమారుడిగా ఇండస్ట్రీలోకి వచ్చిన టైగర్ ష్రాఫ్ కు.. ఇప్పటికే తనదైన ఇమేజ్ ఉంది. యాక్షన్ హీరోగాను.. టఫ్ డ్యాన్సింగ్ సీక్వెన్స్ లను అలవోకగా చేయడంలోను టైగర్ తన సత్తా చాటుతున్నాడు. ఇప్పుడీ హీరో తన డైరెక్టర్ కి ఏకంగా బెంజ్ కారు గిఫ్ట్ ఇచ్చేయడం బాలీవుడ్ లో హాట్ న్యూస్ అయిపోయింది.

టైగర్ ష్రాఫ్ అరంగేట్ర మూవీ హీరోపంతి. ఈ చిత్రం ద్వారా టైగర్ ను బాలీవుడ్ కు గ్రాండ్ గా పరిచయం చేశాడు దర్శకుడు సబ్బీర్ ఖాన్. హీరోపంతి మంచి విజయం సాధించింది కూడా. ఆ తర్వాత రెండో సినిమా కూడా ఇదే దర్శకుడితో చేశాడు టైగర్ ష్రాఫ్. బాఘీ టైటిల్ పై తెరకెక్కగా.. ఈ చిత్రం కూడా ఘన విజయం సాధించింది. కుర్ర హీరో ఖాతాలో మరో విజయాన్ని నమోదు చేసింది. ఇప్పుడు ముచ్చటగా తన మూడో సినిమాను కూడా సబ్బీర్ ఖాన్ తోనే చేస్తున్నాడు టైగర్ ష్రాఫ్. ఈ మూవీ పేరు మున్నా మైఖేల్. ఇప్పటికే రిలీజ్ అయిన ట్రైలర్ కు మంచి స్పందన వస్తోంది కూడా.

తనకు బాలీవుడ్ లో మంచి ఎంట్రీ ఇచ్చిన దర్శకుడు సబ్బీర్ ఖాన్ కు.. కాస్ట్లీ బెంజ్ కార్ ఇచ్చి తన కృతజ్ఞతలు చాటుకున్నాడు టైగర్ ష్రాఫ్. 'టైగర్.. అతని కుటుంబ సభ్యులు చాలా మంచి వారని నాకు ముందే తెలుసు. అయితే.. మరీ బెంజ్ కారు బహుమతి ఇచ్చేసి నన్ను సర్ ప్రైజ్ చేస్తారని ఏ మాత్రం ఎక్స్ పెక్ట్ చేయలేదు. కొత్త బెంజ్ కారు నడపడం కోసం ఎంతో ఉత్సాహంగా ఉన్నా' అని చెప్పాడు సబ్బీర్ ఖాన్.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/