ఇండియా రాంబో గా కుర్ర హీరో

Fri May 19 2017 17:36:22 GMT+0530 (IST)

హాలీవుడ్ సూపర్ హిట్ మూవీ.. వరల్డ్ మొత్తం యాక్షన్ హీరోగా సిల్వెస్టర్ స్టాలోన్ కు పేరు తెచ్చిన సినిమా ఏంటంటే.. ''రాంబో'' అని ఎవరైనా టక్కున చెప్పేస్తారు. మెగాస్టార్ చిరంజీవి 'ఖైదీ' వంటి సినిమాలు ఈ రాంబో ప్రేరణతో రూపొందినవే. రాంబో సినిమాను  ఇప్పుడు ఇండియాలో రీమేక్ చేద్దాం అని అన్నీ ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ సినిమాలో లీడ్ రోల్ కోసం హృతిక్ రోషన్.. సిద్దార్ద్ మల్హోత్రా వంటి హీరోల పేర్లు వినిపించాయి కాని.. చివరకు వేరే హీరోను పిక్ చేశారు.

కుర్ర హీరో టైగర్ ష్రాష్ ను ఈ సినిమా లో లీడ్ రోల్ కి ఒకే చేసినట్లు తెలుస్తోంది. ఈ సినిమాను ఇండియన్ వర్షన్లో తీస్తారట. ఇండియాను ఆక్రమించిన సైనిక బలగాలు నుండి ఒక చివరి యుద్ధ సైనికుడు ఎలా బ్రతికి బయటపడ్డాడు అనే కథాంశంతో కథ ఉంటుంది. 'బ్యాంగ్ బ్యాంగ్' సినిమా డైరెక్టర్ ఆనంద్ డైరెక్ట్ చేయబోతున్నాడు. బ్యాంగ్ బ్యాంగ్ కూడా హాలీవుడ్ ఫిల్మ్ ‘నైట్ అండ్ డే’ సినిమాకు రీమేక్ కావడంతో.. ఇతన్నే ఎంచుకున్నారు మేకర్లు. ఇప్పుడు మన ఇండియా లో సినిమావాళ్ళు యుద్దాలు  వీరోచిత పోరాటాలు ఉండే సినిమాలు తీయడానికి తెగ ఆరాటం చూపిస్తున్నారు. అందుకే టైగర్ ఈ సినిమాను రీమేక్ చేయడానికి తెగ సంబరపడుతున్నాడు.

“నేను ఇన్నాళ్ళు మార్షల్ ఆర్ట్స్ నేర్చుకున్నందుకు ఇప్పుడు ప్రతిఫలం దక్కింది. నేను చిన్నప్పుడు నుండి వార్ సినిమాలు అన్నా యాక్షన్ మూవీస్ అన్నా చాలా ఇష్టం. ఈ అవకాశం వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. ది లెజెండ్ సిల్వెస్టర్ స్టాలోన్ ను మాలాంటి వాళ్ళు రిప్లేస్ చేయలేకపోయినా ఇన్నేళ్లు చేసిన సాధనతో కొంచె మైనా ఆయనలా చేయడానికి ప్రయత్నిస్తాను'' అంటూ సెలవిచ్చాడు.  చేస్తాను అని అనుకుంటునన్ను అని చెప్పాడు టైగర్. ఈ సినిమాను  2018 చివరి నెలలలో విడుదల చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/