హాట్ జోడీ రూ. 5 కోట్లు అడిగినా?

Thu Jul 12 2018 18:56:50 GMT+0530 (IST)

కొన్ని సినిమా జంటలు టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా నిలుస్తుంటాయి. అందరి దృష్టినీ ప్రత్యేకంగా ఆకర్షిస్తుంటాయి. ఆ తరహా బాలీవుడ్  జంటల్లో టైగర్ ష్రాఫ్ - దిశాపఠానీ ఒకటి. ఈ ఇద్దరూ భార్యాభర్తల్లాగా  చెట్టాపట్టాలేసుకొని తిరగడమే అందుకు కారణం. ఇద్దరూ ఎప్పట్నుంచో ప్రేమలో ఉన్నట్టు వార్తలొస్తున్నాయి. ఎవరేమనుకొన్నా పట్టించుకోకుండా  ఈ జోడీ ముంబైలో స్వేచ్ఛగా తిరుగుతుంటుంది. మొన్నటికి మొన్న అంబానీ కుటుంబంలో జరిగిన వేడుకలోనూ ఇద్దరూ చేతిలో చెయ్యేసుకొని సందడి చేశారు.త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారని కూడా వార్తలొచ్చాయి. వీళ్లు మాత్రం తాము బెస్ట్ ఫ్రెండ్స్ అని చెబుతున్నారు. నిజంగా వాళ్లిద్దరి మధ్య బంధం ఏంటో వాళ్లకు మాత్రమే తెలుసు కానీ... బయట ప్రపంచానికి మాత్రం హాట్ జోడీగా దర్శనమిస్తోంది. అందుకే ఈ జంట దగ్గరికి ఈమధ్య పలు బ్రాండ్లకి సంబంధించిన ఆఫర్లు వెళుతున్నాయట. మీరిద్దరూ కలిసి మాకు ప్రచారం చేస్తే బాగుంటుందని అడుగుతున్నాయట. అందులో భాగంగా  ఇటీవల ఓ ఆయిల్ కంపెనీ బ్రాండింగ్ చేయమని అడిగితే టైగర్ - దిశాలు మాత్రం రూ: 5 కోట్లు కోట్ చేశారట. మరీ ఇంతనా అని ఆ కంపెనీ మొదట అవాక్కయినా... జోడీకి మంచి క్రేజ్ ఉండటంతో ఓకే అని చెప్పినట్టు సమాచారం. ఈమధ్య బ్రాండ్ అంబాసిడర్లుగా ఇద్దరిద్దరు కనిపించడం ఓ కొత్త ట్రెండ్ అయ్యింది. అభిషేక్ - ఐశ్వర్య -  జ్యోతిక - సూర్య - సమంత - నాగచైతన్య... ఇలా ఇద్దరిద్దరూ కలిసి బ్రాండ్లకి ప్రచారం చేస్తున్నారు. ఆ వరసలో ఇప్పుడు దిశా - టైగర్లు కూడా చేరబోతున్నారన్నమాట.