Begin typing your search above and press return to search.

ప్రేమికుల ఫోటోలతో పోస్టర్ పడింది

By:  Tupaki Desk   |   21 Feb 2018 10:49 AM GMT
ప్రేమికుల ఫోటోలతో పోస్టర్ పడింది
X
రియల్ లైఫ్ లో ప్రేమికులు.. ఒకే సినిమాలో కలిసి నటిస్తే ఆ కిక్కే వేరుగా ఉంటుంది. మన దగ్గర ఇలాంటివి కాసింత తక్కువ కానీ.. బాలీవుడ్ లో ప్రస్తుత ప్రేమికులతో ఏం ఖర్మ.. పాత ప్రియులు- మాజీ ప్రియురాళ్లతో కూడా సినిమాలు వచ్చేస్తుంటాయి. ఇప్పుడు బాఘీ2 అంటూ ఓ రెబెల్ లవ్ స్టోరీ వచ్చేస్తోంది.

యథావిధిగా బాఘీలో నటించిన టైగర్ ష్రాఫ్ ఇందులో కూడా హీరోగా నటిస్తున్నాడు. కానీ ఈ చిత్రానికి అసలు సిసలైన అట్రాక్షన్ ఏంటంటే.. దిశా పటానీ హీరోయిన్ గా నటించడమే. తెలుగులో లోఫర్ తో ఓ ఫ్లాప్.. ఎంఎస్ ధోనీ-ది అన్ టోల్డ్ స్టోరీ మూవీతో ఓ సక్సెస్ ను ఖాతాలో వేసుకున్న ఈ బ్యూటీ.. ఆ తర్వాత టాప్ స్టార్స్ తో తప్పితే సినిమాలు చేయనని భీష్మించుకుని కూర్చుంది. అదే సమయంలో టైగర్ ష్రాఫ్ తో ప్రేమాయణం నడపడం ముంబైలో హాట్ టాపిక్ అయింది. ఈ విషయం అమ్మడు కన్ఫాం చేయలేదు కానీ.. టైగర్-దిశ ప్రేమ నలుదిక్కులకు వ్యాపించేసింది.

ఇప్పుడు ఈ ప్రేమికులు ఇద్దరూ తొలిసారి కనిపించిన పోస్టర్ వచ్చేసింది. బాఘీ2 పోస్టర్ ను యూనిట్ రివీల్ చేసింది. ఇద్దరూ యమా హాటుగా పోజు ఇచ్చేశారు. దిశా డ్రెసింగ్ అయితే అదరహో అనాల్సిందే. టైగర్ ష్రాఫ్ మరోసారి కండలు చూపించే పనిలో పడిపోయాడు. ఇద్దరి కెమిస్ట్రీ మాత్రం ఈ పోస్టర్ కే హైలైట్ అని చెప్పవచ్చు. తొలి పోస్టర్ లోనే ఇంత రచ్చ చేస్తే.. ఇక సినిమాలో కంటెంట్ ఎలా ఉంటుందో?